Begin typing your search above and press return to search.

ఇది సెట్ బ్యాక్ .. అధికారం మాదే !

తెలంగాణ భవన్‌లో‌ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

By:  Tupaki Desk   |   2 Jun 2024 3:30 PM GMT
ఇది సెట్ బ్యాక్ .. అధికారం మాదే !
X

‘’తెలంగాణ వస్తుందని ఎవరూ కల కూడా కనలేదు.15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది.బీఆర్‌ఎస్‌‌ను ఖతం చేస్తామని కొందరు అంటున్నారు. ఇవన్నీ తాత్కాలిక సెట్‌బ్యాక్ మాత్రమే. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. దఅందులో 100శాతం అనుమానం లేదు.25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖతం చేయగలరా..? పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా.. ?ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారం’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తెలంగాణ భవన్‌లో‌ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భరించలేనటువంటి, అమానుషానికి లోనైన తెలంగాణ దుఃఖాన్ని తలుచుకుని బాధపడేవాళ్లం. తెలంగాణ అనకూడదని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీచేసిన రోజులున్నాయి. రాజీలేని పోరాటం చేసిన జయశంకర్ గారు నాతో ఉండేవారు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మేవాళ్లు కూడా.. ఒక్కోసారి ఆ సిద్ధాంతాలను పక్కనబెట్టి పనిచేయాల్సి వస్తుంది అని కేసీఆర్ అన్నారు.

1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది.చాలా మంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారు.వాళ్లను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరిగే అన్యాయాలను జయశంకర్ గారు ప్రశ్నిస్తూ వచ్చారు. వలసలకు, కరెంట్‌ కోతలకు, ఆత్మహత్యలకు.. చేనేత కార్మికుల ఆకలి చావులకు గురైన తెలంగాణ ఉండేది. లోక్ సభ ఫలితాలు ఎలా ఉన్నా.. తెలంగాణకు బీఆర్ఎస్ రక్షణ కవచం అని కేసీఆర్ అన్నారు.