Begin typing your search above and press return to search.

కేసీయార్ కీలక నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికల్ల ఏ అంశాలపై జనాలు వ్యతిరేకించారు, రేపు పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా ఉన్న అంశాలు ఏమిటనే విషయమై అభిప్రాయాలు తీసుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   8 March 2024 9:20 AM GMT
కేసీయార్ కీలక నిర్ణయం
X

రాబోయే పార్లమెంటుఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీయార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి అభ్యర్ధులను ఎంపికచేయాలని. ఇందులో భాగంగానే సెగ్మెంట్ల వారీగా సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ తో కేసీయార్ మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత జనాల్లో బీఆర్ఎస్ పై ఎలాంటి అభిప్రాయాలున్నాయనే విషయంపై ఆరాతీస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్ల ఏ అంశాలపై జనాలు వ్యతిరేకించారు, రేపు పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా ఉన్న అంశాలు ఏమిటనే విషయమై అభిప్రాయాలు తీసుకుంటున్నారట.

అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఏ నేత పోటీచేస్తే ఎక్కువ మద్దతు ఉంటుందనే విషయాన్ని కూడా కేసీయార్ ఆరాతీస్తున్నారట. తాజాగా వరంగల్ టికెట్ ఆశిస్తున్న కడియం కావ్య, ఆరూరి రమేష్, పెద్ద స్వప్న విషయమై అభిప్రాయాలు తీసుకున్నారట. అలాగే భువనగిరిలో బిక్షమయ్యగౌడ్, పైళ్ళశేఖరరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు, జహీరాబాద్ లో పోచారం భాస్కరరెడ్డి, మల్కాజ్ గిరిలో శంభీపూర్ రాజు, లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ లో తలసాని సాయికిరణ్, చేవెళ్ళల్లో రంజిత్ రెడ్డి, నరేందర్ గౌడ్, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్ధిత్వాతపై నేతలతో మాట్లాడి పీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ముగ్గురు ఎంపీలు పార్టీని వదిలేశారు. ఆదిలాబాద్ ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు రాజీనామాలు చేసి బీజేపీలో చేరారు. మెదక్ ఎంఎల్ఏగా గెలిచిన తర్వాత కొత్తా ప్రభాకరరెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అంటే తొమ్మిదిమంది ఎంపీల్లో నలుగురు రాజీనామాలు చేసేశారు. మిగిలిన ఐదుగురు ఎంపీల్లో ఎంతమందికి కేసీయార్ టికెట్లిస్తారనే విషయంలో క్లారిటిలేదు. చేవెళ్ళ ఎంపీగా రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే తాను పోటీచేసేది లేదని చెప్పేశారు. దాంతో మిగిలిన నేతలు కూడా ఎంపీలుగా పోటీచేసే విషయంలో వెనకాడుతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.