కేసీయార్ కేటీయార్ : ఆ మూడు సీట్ల పైన హాట్ హాట్ చర్చ...!
కాంగ్రెస్ అదృష్టమో లేక కాంగ్రెస్ కష్టపడిన విధానమో తెలియదు కానీ ఆ పార్టీ వైపుగా అనుకూల వాతావరణం ఏర్పడుతోంది అంటున్నారు
By: Tupaki Desk | 23 Nov 2023 3:30 PM GMTతెలంగాణా ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. పోలింగ్ వారం వ్యవధికి వచ్చేసింది. దీంతో తెలంగాణా రాజకీయం మీద అంతటా చర్చ సాగుతోంది. ఈసారి ఎవరు గెలుస్తున్నారు అన్నది గల్లీ గల్లీలో చర్చగా మారుతోంది. ఇవన్నీ పక్కన పెడితే రోజు రోజుకూ తెలంగాణా రాజకీయ వాతవరణం మారిపోతోంది అని అంటున్నారు.
గెలుపు గుర్రం ఏ రాజకీయ పార్టీయో దాని వైపే జనాలు మొగ్గు చూపడం మొదలైంది. సాధారణంగా గెలుపు ఎవరిది అన్న అభిప్రాయం బలపడడమే ఎన్నికల్లో ఎత్తుగడ. అది కనుక స్టార్ట్ అయితే మెల్లగా ఆ వాతావరణం కమ్ముకుంటే కనుక మెజారిటీ జనాలు ఆ వైపునకే చేరుతారు.
కాంగ్రెస్ అదృష్టమో లేక కాంగ్రెస్ కష్టపడిన విధానమో తెలియదు కానీ ఆ పార్టీ వైపుగా అనుకూల వాతావరణం ఏర్పడుతోంది అంటున్నారు. జంపింగ్స్ కూడా కాంగ్రెస్ వైపే మళ్లడం కూడా జనాలకు ఒక సంకేతం ఇచ్చినట్లు అవుతోంది. జనాలు కోరుకుంటున్నారు కాబట్టి అంటూ నేతలు కాంగ్రెస్ వైపుగా గోడ దూకుతూంటే ప్రజలు కూడా కాంగ్రెస్ కి ఆదరణ పెరగబట్టే రాజకీయ నేతలు ఆ వైపుగా చూస్తున్నారు అని భావిస్తున్నారు
ఇలా పరస్పర ప్రభావితమైన రాజకీయం కాస్తా కాంగ్రెస్ కి పూర్తిగా అవకాశంగా మారుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి మొత్తం 119 స్థానాలకు ఎన్నిక ఒక వంతు అయితే అందులో మూడు సీట్ల మీద అందరి దృష్టి ఉంది అని అంటున్నారు. కేసీయార్ గత రెండు ఎన్నికల్లో గెలిచిన గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎపుడూ కామారెడ్డి వైపు పోటీ కోసం చూడలేదు.
కానీ ఫస్ట్ టైం ఆయన పోటీకి దిగుతున్నారు. దాంతో రెండు రకాలైన ఆలోచనలు మొదట్లో వినిపించాయి. కేసీయార్ నిజమాబాద్ సహా ఉత్తర తెలంగాణాలో పార్టీని పటిష్టం చేసుకోవడానికే రెండవ సీటు నుంచి పోటీ అని అంతా అనుకున్నారు.
కానీ కాలక్రమంలో ప్రత్యర్ధి పార్టీలు చేస్తున్న ప్రచారం కానీ బీయారెస్ కి ప్రతికూలత కానీ చూస్తే కనుక ఓటమి భయంతోనే రెండు సీట్ల పోటీ అన్న భావన కూడా మెల్లగా జనాలలో ఏర్పడేలా చేశారు. దాంతో కేసీయార్ పోటీ చేస్తున్న రెండు సీట్లలో గెలుస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రెండు సీట్లు గెలిస్తే సంగతేంటి. అలా కాకుండా ఒక సీటు ఓడితే సంగతేంటి అన్నది కూడా ఇపుడు బిగ్ డిబేట్ గా ఉంది అని అంటున్నారు.
కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి రేవంత్ రెడ్డి వచ్చినపుడు కూడా భారీ ఎత్తున జనాలు తరలిరావడం కేసీయార్ పూర్వీకులు కూడా రేవంత్ రెడ్డిని కలసి తమ మద్దతుని తెలియచేయడం వంటివి చూసిన తరువాత కాంగ్రెస్ లో గెలుపు ఆశలు మొదలయ్యాయట. ఇక గజ్వేల్ లో ఈటెల రాజెందర్ కూడా గట్టిగా ప్రచారం చేస్తూ బీయారెస్ కి దడపుట్టిస్తున్నారు అని అంటున్నారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ లో బంపర్ మెజారిటీ కేసీయార్ కి వచ్చింది.
ఈసారి అలా వస్తుందా అన్నది ఒక చర్చ అయితే గజ్వేల్ లో టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ రెండు సీట్లతో పాటు సిరిసిల్లలో కేటీయార్ సీటు కూడా ఇపుడు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే సీటుగా మారింది అని అంటున్నారు. ఇక్కడ నుంచి నాలుగైదు పర్యాయాలు కేటీయార్ గెలిచారు. మరోసారి గెలుపు కోసం ఆయన చూస్తున్నారు.
అయితే బీయారెస్ రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఏర్పడిన యాంటీ ఇంకెంబెన్సీ అగ్ర నేతల నియోజకవర్గాలలో ఎంత శాతం ఉంటుంది. గెలుపుని ప్రభావితం చేయకపోయినా మెజారిటీని ఏమైనా తగ్గిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఈ మూడు సీట్ల మీద చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు.