బీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు: కేసీఆర్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకోనుందని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు
By: Tupaki Desk | 11 May 2024 10:59 AM GMTప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకోనుందని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో తాను 17 రోజులు పర్యటించినప్పుడు ప్రజల నుంచి అందిన సమాచారం మేరకు తాను ఈ నిర్ణయానికి వచ్చానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా.. ప్రజలను విసిగించాయని తెలిపారు. రాష్ట్రంలో అర్భక ముఖ్యమంత్రి పాలన కారణంగా... కీలకమైన విషయాలు తెరమరుగయ్యాయన్నారు.
శ్వేత పత్రాలు విడుదల, చర్చ పెట్టడం, ప్రతిపక్షాలను తూలనాడడం, ప్రతిపక్షాలను దెబ్బతీయడం వంటి వాటిపైనే దృష్టి పెట్టారు కానీ.. రాష్ట్ర సంక్షేమంపై పెద్దగా దృష్టి పెట్టలేదని.. కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌పై చాలా ఆగ్రహంతో ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రజాపాలన వదిలేసి.. ప్రతిపక్షాలపై విరుచుకు పడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని.. తన సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నానని అన్నారు. రాహుల్ సరూర్ నగర్ వస్తే.. కనీసం రెండు మూడు వేల మందిని కూడా సమీకరించలేక పోవడం.. కాంగ్రెస్ పరిస్థితిని కళ్లకు కడుతోందన్నారు.
కార్యకర్తల్లోకానీ.. నాయకుల్లో కానీ.. ఇప్పుడు జోష్ కొరవడిందన్నారు. ప్రజల్లోనూ స్పందన కూడా తగ్గిందని కేసీఆర్ అన్నారు. మేధావులు సహా.. అందరినీ బాధించిన విషయం.. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడ మేనన్నారు. ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా.. ఎవరూ ఇలా చెప్పరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు.. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రం బాగుందనే చెప్పాలన్నారు. అందుకే తాను ధనిక రాష్ట్రమని చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
వ్యవస్థలను కూడా.. కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. ఆరోగ్య శ్రీ గురించి.. నాకు అధికారులు చెప్పినప్పుడు.. దానిని కొనసాగించానన్నారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసి కూడా.. కొనసాగించానన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా.. వంటి అనేక కార్యక్రమాలు కొనసాగించామ న్నారు. పూర్వ ముఖ్యమంత్రులు.. ప్రభుత్వం విషయంలో మర్యాద పాటించాలన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన మంచి కార్యక్రమాలను కూడా దెబ్బతీస్తున్నారని చెప్పారు.