Begin typing your search above and press return to search.

కొత్త చర్చ... కవిత అరెస్ట్ పై కేసీఆర్ రియాక్షన్ కి రీజన్ ఇదేనంట!?

తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా... కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని, ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   19 April 2024 3:30 PM GMT
కొత్త చర్చ... కవిత అరెస్ట్  పై కేసీఆర్  రియాక్షన్  కి రీజన్  ఇదేనంట!?
X

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి అరెస్టులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. అయితే... ఈ ఆరెస్ట్ పై బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కవిత తండ్రి కేసీఆర్ మాత్రం నిన్నటి వరకూ స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా స్పందించారు. అయితే... ఇంతకాలం ఆగి ఇప్పుడు స్పందించడంవెనుక బలమైన కారణం ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక కవిత అరెస్టుపై నిన్నటి వరకు స్పందించని కేసీఆర్.. తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా... కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని, ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో కవితపై ఎలాంటి కేసు లేదని.. కేవలం కక్షపూరితంగానే అరెస్టు చేశారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీనికి గల కారణాన్ని వివరించారు. ఇందులో బలంగా... గతంలో బీఆరెస్స్ ప్రభుత్వాన్ని కూల్చాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసిన వ్యవహారంలో బీజేపీ సీనియర్ నేత సంతోష్ ను అరెస్టు చేయడానికి ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని తెలిపారు. అందువల్లే తమపై కక్ష పెంచుకొని కవితను అరెస్టు చేశారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే... ఈ వ్యాఖ్యలు కవిత అరెస్టు సమయంలో ఎందుకు చెప్పలేదంటూ పలువురు పలు సందేహాలు తెరపైకి తెస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక మతలబు ఏమైనా ఉందా అనే చర్చను కూడా తెరపైకి తెస్తున్నారు. ఈ సందేహాల నేపథ్యంలో పలు విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో కేసీఆర్ మాట్లాడకపోవడం అంటే.. ఆమె నేరం చేసినట్టు ఆయన కూడా అంగీకరించినట్లేననే సంకేతాలు ప్రజలలోకి వెళతాయని పలువురు బీఆరెస్స్ నేతలు అభిప్రాయపడ్డారని.. పైగా లోక్ సభ ఎన్నికల వేళ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న వేళ కవిత అరెస్టు గురించి కేసీఆర్ మాట్లాడకపోవడంతో ప్రజల్లో ఒక క్వశ్చన్ ని అలాగే వదిలేసినట్లు అవుతుందని తెలిపారంట.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్పందించారని.. కవిత అరెస్ట్ కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగం మాత్రమేనని.. ఆసలు కేసే లేదని.. గతంలో బీజేపీ విషయంలో తమ ప్రభుత్వం చేసిన ఒక పనికి ఇది ప్రతిఫలంగా మాత్రమే ఆ పార్టీ నేతలు చేస్తున్నారని తెలిపారని అంటున్నారు!