Begin typing your search above and press return to search.

దానంకు రేవంత్ బిగ్ టాస్క్.. సూపర్ గిఫ్ట్!!

ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్ ను ఖాళీ చేయించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ & కో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 July 2024 4:15 AM GMT
దానంకు రేవంత్  బిగ్  టాస్క్.. సూపర్  గిఫ్ట్!!
X

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. బీఆరెస్స్ ఎమ్మెల్యేలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మరో 15 రోజుల్లో ఇంకో 17 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేస్తే.. ఇక అసెంబ్లీలో బీఆరెస్స్ ను పూర్తిగా కాంగ్రెస్ లో కలిపేయొచ్చని పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్ ను ఖాళీ చేయించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ & కో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 9మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో... ఆ బీఆరెస్స్ బలం 29కి పడిపోయింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కు రేవంత్ బిగ్ టాక్స్ ఇచ్చారని అంటున్నారు.

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికలో ఆ సీటును కాంగ్రెస్ గెలుచుకోవడంతో బీఆరెస్స్ బలం 38కి చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఇది చిన్న నెంబర్ ఏమీ కాదు!

కాకపోతే... సీఎంగా తప్ప ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి వెళ్లను అన్నట్లుగా కేసీఆర్ లైట్ తీసుకున్నారు. దీంతో... ఇలా పట్టింపులేని అధినేత దగ్గర ఉండటం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ... సుమారు 9 మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కారు దిగిపోయి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. దీంతో బీఆరెస్స్ బలం 29కి చేరింది.

వాస్తవానికి ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే సదరు పార్టీ శాసన సభా పక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు.. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు!

ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిన, చేరబోతున్నట్లు చెబుతున్న బీఆరెస్స్ నేతలు ఈ దిశగానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 26మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ డోర్లు తెరిచేసిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 9మంది చేరిపోయారు కాబట్టి ఇంకా 17మంది కోసం వెయిటింగ్ అని అంటున్నారు.

అయితే ఈ 17మందిలో గ్రేటర్ పరిధిలోని బీఆరెస్స్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలిపే బాధ్యతను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అప్పగించారంట సీఎం రేవంత్ రెడ్డి! దీంతో.. తాజాగా స్పందించిన దానం మరో ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు.

ఇలా రేవంత్ ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తే దానంకు మంత్రి పదవి ఇస్తామనే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది! దీంతో... దానం ఇప్పటికే డ్యూటీ ఎక్కేశారని.. ఇటీవల చెప్పినట్లు మరో 15 రోజుల్లో పని పూర్తిచేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. మరి ఆపరేషన్ బీఆరెస్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది.. కేసీఆర్ ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది వేచి చూడాలి!