Begin typing your search above and press return to search.

కేసీయార్ సర్వే చేయిస్తున్నారు ఆ విషయంలో...!

కేసీయార్ ఇపుడు మాజీ సీఎం. బీయారెస్ అధికారంలో నుంచి తప్పుకోవడంతో ఆయన ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయిపోయారు

By:  Tupaki Desk   |   5 Dec 2023 12:30 PM GMT
కేసీయార్ సర్వే చేయిస్తున్నారు ఆ విషయంలో...!
X

కేసీయార్ ఇపుడు మాజీ సీఎం. బీయారెస్ అధికారంలో నుంచి తప్పుకోవడంతో ఆయన ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయిపోయారు. ఓటమికి గల కారణాలు ఏంటి అన్న అన్వేషణలో బీయారెస్ నేతలు అంతా తలమునకలై ఉన్నారు. బీయారెస్ గెలుపు ఖాయం అనుకుంది. కనీసంగా సాధారణ మెజారిటీ అయినా దక్కుతుంది అని లెక్క వేసుకుంది. అయితే ఒక్కసారిగా ఫలితాలు రివర్స్ కొట్టాయి.

దాంతో పూర్తి నిర్వేదంలో బీయారెస్ అగ్ర నాయకత్వం కూరుకునిపోయింది. ఇదిలా ఉంటే ఎందుకు ఇంత ధీమా పడ్డారు గెలుపు మనదే అని ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు అన్నది అయితే ఇప్పటికి బీయారెస్ లోనే కాదు రాజకీయ వర్గాలకు కూడా అర్ధం కాని విషయంగా ఉంది.

ఇదిలా ఉంటే బీయారెస్ కి జనాలు 39 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అంటే బలమైన ప్రతిపక్షంగా కీలకమైన పాత్ర పోషించమని కూడా వారు ఆదేశించారు అన్న మాట. దీంతో కాంగ్రెస్ లో సీఎం ఎవరు అన్నది ఒక వైపు చర్చగా ఉంటే మరోవైపు చూస్తే బీయారెస్ తరఫున ఎవరు ప్రతిపక్ష నేత అవుతారు అన్నది కూడా ఆసక్తిని పెంచుతున్న విషయంగా ఉంది.

ఎందుకంటే రెండు పర్యాయాలు సీఎం గా చేసిన కేసీయార్ కోరి కోరి విపక్ష నేతగా అసెంబ్లీలో కనిపించరు అని అంటున్నారు. ఆయన ఈ విషయంలో వేరేగా ఆలోచిస్తారు అని అంటున్నారు. కేసీయార్ కాకపోతే బీయారెస్ తరఫున ఎల్పీ లీడర్ ఎవరు అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే కేటీయార్ పేరు అలాగే హరీష్ రావు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.

ఈ విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా కేసీయార్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఎవరైతే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపించగలరు అన్నది కూడా కేసీయార్ లోతైన ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఇక కేటీయార్ హరీష్ రావులలో ఎవరైతే బాగుంటుంది అన్నది కూడా ఆయన ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఈ ఇద్దరు అగ్ర నేతలూ వద్దు అని అనుకుంటేనే ఎస్సీ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వర్గం నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి ఉన్నారు. ఎంతో అనుభవం కలిగిన కడియం శ్రీహరి అయితే ఎలా ఉంటుంది అని కూడా కేసీయార్ ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక అసెంబ్లీ అంటే అధికార పక్షం వైపు నుంచి రేవంత్ రెడ్డి ఉంటారు. ఆయనని సమర్ధంగా ఎదుర్కోవాలీ అంటే ధాటీగా మాట్లాడగలిగిన నేత అయి ఉండాలి. అవసరం అయిన వ్యూహాలు కూడా రూపొందించాల్సి ఉంటుంది. అందుకే హరీష్ రావు అయితే బాగుంటారని కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కేసీయార్ దృష్టికి తీసుకుని వస్తున్నట్లుగా చెబుతున్నారు.

అయితే కేటీయార్ ని తన తరువాత సీఎం గా ప్రొజెక్ట్ చేయాలని కేసీయార్ కి ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఆయనకే కీలక బాధ్యతలు ఎపుడూ అప్పగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవసారి బీయారెస్ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీయార్ కే సీఎం పోస్ట్ అన్నది కూడా అంతా అంటారు. కానీ అంతా తారు మారు అయింది.

ఈ నేపధ్యంలో ఎల్పీ లీడర్ గా కేటీయార్ ని ముందు పెట్టి అసెంబ్లీలో పెద్ద ఎత్తున ప్రొజక్ట్ చేస్తే రేపటి ఎన్నికల నాటికి ఆయనే సీఎం అన్న భావన ఏర్పడుతుంది అని కేసీయార్ ఆలోచిస్తున్నారుట. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రం హరీష్ రావు పేరు చెబుతున్నారు అని అంటున్నారు హరీష్ రావు సమర్ధుడిగా అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయగల కెపాసిటీ ఉన్న నేతగా ఉంటారని చాలా మంది భావన. మరి అదే కనుక జరిగితే కేసీయార్ ఏమి చేస్తారో.

మొత్తానికి అభిప్రాయ సేకరణ అంటూ ఎన్ని చేసినా కూడా చివరికి నెగ్గేది కేసీయార్ మాటే కాబట్టి ఆయన అవును అనుకుంటే కేటీయారే సీఎల్పీ లీడర్ అవుతారు అని అంటున్నారు. ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కేటీయార్ ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించారని గుర్తు చేస్తున్నారు అంటే ఆయనకు ఎల్పీ పదవి మీద కోరిక ఉందని అంటున్నారు. దాంతో పాటు ఆయన ప్రతిపక్షంగా సమర్ధవంతమైన పాత్ర పోషిస్తామని మీడియా ముందు చెప్పుకొచ్చారు. దాంతో కేటీయార్ పేరే ఆమోదిస్తారా అన్నదే కీలకమైన చర్చగా ఉంది మరి.