కేసీఆర్ అవుట్ డేటెడ్ లీడర్ అయ్యారా ?
ఇక 2014లో ఉద్యమకారుడు నుంచి ఫక్తు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ అవతారం ఎత్తారు పదేళ్ల పాటు తెలంగాణాను సీఎం గా పాలించారు.
By: Tupaki Desk | 25 April 2024 11:41 AM GMTకేసీఆర్ అంటే ఒకపుడు తెలంగాణా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. ఉమ్మడి ఏపీలో ఆయన రాజకీయం ఒక లెవెల్ లో ఉండేది జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ చర్చ నాడు ఉండేది. ఇక 2014లో ఉద్యమకారుడు నుంచి ఫక్తు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ అవతారం ఎత్తారు పదేళ్ల పాటు తెలంగాణాను సీఎం గా పాలించారు.
దాంతో పాటు కావాల్సినంత ప్రజా వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారు. ఫలితంగా కేసీఆర్ 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక కేసీఆర్ వయసు ఏడు పదులు దాటింది. ఆయన రాజకీయం సుదీర్ఘమైనది. ఆయన వ్యూహాలు ఎత్తులు అన్నవి గతంలో బాగా పారేవి. ఇపుడు మాత్రం పొలిటికల్ గా న్యూ జనరేషన్ వచ్చేసింది.
దాంతో కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అవుట్ డేటెడ్ అయింది అని అంటున్నారు. దానికి తగినట్లుగా ఆయన వైఖరి వ్యవహార శైలి కూడా ఉంది అని అంటున్నారు. తాజాగా కేసీఆర్ ఒక ప్రముఖ చానల్ కి వచ్చి ఓపెన్ డిబేట్ లో పాల్గొన్నారు. అయితే ఆ చానల్ కేసీఆర్ తో డిబేట్ అని అప్పటికి రెండు రోజుల ముందు నుంచి ప్రచారం చేసింది. ఫలానా సమయానికి కేసీఆర్ తో డిబేట్ అని ఎంత ఊదరగొట్టినా కేసీఅర్ తో చేసిన ఓపెన్ డిబేట్ కి టీఆర్పీ అయితే పెద్దగా రాలేదు అని అంటున్నారు. ఈ విధంగా టాక్ అయితే నడుస్తోంది.
అదే టైం లో యూట్యూబ్ లైవ్ లో సైతం పెద్దగా వ్యూస్ రాలేదు అని అంటున్నారు. అంతే కాదు చాలా మంది ప్రజలకు అసలు కేసీఆర్ దాదాపు పదేళ్ళ తరువాత ఒక చానల్ కి వచ్చి మరీ డిబేట్ చేస్తున్నారు అన్నది కూడా తెలియదు అని అంటున్నారు. అంతే కాదు ఈ డిబేట్ సందర్భంగా కేసీఆర్ పెద్ద డైలాగ్స్ చెప్పారు. కానీ అవేమీ పేలలేదు అని అంటున్నారు.
నిజానికి చూస్తే కేసీఆర్ మార్క్ రాజకీయం ఈ రోజులలో పండడం లేదు అని అంటున్నారు. తెలంగాణాలో చూస్తే మంచి మాటకారిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన గుక్క తిప్పుకోకుండా చేసే ప్రసంగం ఇపుడు యూత్ ని పట్టేస్తోంది. ఆయన స్పీచ్ లో భారీ పద ప్రయోగాలు ఏవీ ఉండవు. అంతే కాదు ఆయన సగటు తెలంగాణా భాషలో యాసలో మాట్లాడుతారు. అదే ఇపుడు ట్రెండ్ అవుతోంది.
దాంతో పాటుగా తెలంగాణాతో పాటుగా దేశ రాజకీయం మారింది. ఇది స్మార్ట్ ఫోన్ యుగం. టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలం. ఇపుడు ఎవరూ కూడా ఎక్కడా తగ్గడంలేదు. వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఆసక్తి వారికి దేని మీద ఉంది అన్నదే ప్రధానంగా ఉంది. అదే టైం లో రొటీన్ డైలాగ్స్ తో రొడ్డకొట్టుడు స్పీచులతో వచ్చే నాయకులను అవుట్ డేటెడ్ గానే యూత్ సహా సాదా జనాలు చూస్తున్నారు.
పైగా కాలం కలసిరానపుడు కూడా ఏ డైలాగులూ పేలవు. ఇక పొలిటీషియన్లు కూడా అప్టూ డేట్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. ప్రతీ పదేళ్ళకు జనరేషన్ మారుతుంది. వారి అభిరుచులు మారుతాయి. దానికి తగినట్లుగా తాము మారాల్సి ఉంది. కానీ కేసీఆర్ లాంటి వారు ఇంకా ఎక్కడో ఉండిపోతున్నారు. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా భావిస్తున్నారు.
తమ మాటే వినాలని అనుకుంటున్నారు. ఈ రకమైన తీరు వల్ల కూడా వర్తమానానికి కేసీఆర్ అవుట్ డేటెడ్ గా అనిపించడంలో ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. వాస్తవాలను రాజకీయ నేతలు అంత తొందరగా జీర్ణించుకోలేరు. ఓటమిని అంగీకరించని మనస్తత్వం కూడా వారిని ప్రజలకు దూరం చేస్తుంది. తాము ఏ తప్పూ చేయలేదని పొరపాటు జనం వైపు నుంచి అని అనుకుంటే కనుక కచ్చితంగా వారు అవుట్ డేటెడ్ అయినట్లే.
ఇక చూస్తే కనుక కేసీఆర్ ఓపెన్ డిబేట్ లో మరోసారి మేము గెలుస్తామని చెప్పారు. ఎన్నికలు అయి ఆరు నెలలు కాలేదు. ఈ టైం లో ఆ మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. పైగా జనాలకు అవి రీచ్ అవవు కూడా అంటున్నారు. ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఏంటి అంటే జనాలు తమకు ఇచ్చిన ప్లేస్ ని రెస్పెక్ట్ చేయడం. అది చేయకపోతే ఆలోచనలు ఎక్కడో పెట్టుకుని తమ అతి ధీమాను ప్రదర్శిస్తే మాత్రం నాచురల్ గా వారిని సైడ్ చేసేస్తూ ఈ తరం ముందుకు పోతుంది. అపుడు ఎంతటి పవర్ ఫుల్ మీడియా నుంచి కనిపించినా కూడా జనాల నుంచి రియాక్షన్ పెద్దగా ఉండదనే అంటున్నారు.