కేసీఆర్ ప్రచారాస్త్రాలు సిద్ధం?
అందుకే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి బలమైన నేతలు వెళ్లిపోయారు.
By: Tupaki Desk | 30 March 2024 2:30 PM GMTపార్లమెంటు ఎన్నికల్లో కనీసంలో కనీసం 6-7 స్థానాల్లో అయినా విజయం దక్కించుకుని తీరకపోతే.. ప్రస్తు తం ఉన్న కొద్దిపాటి పార్టీ పరువు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. అందుకే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి బలమైన నేతలు వెళ్లిపోయారు. ఇక, ఎమ్మెల్యేల సంఖ్యా బలం కూడా తగ్గిపోయింది. ఎంపీల సంఖ్యలోనూ మార్పు వచ్చింది. దీంతో పార్టీ బలహీన పడుతోందన్న వాదన వినిపించింది. దీనిని తగ్గించి.. బలపడుతుందన్న వాదనను తీసుకురా వాల్సిన అవసరం ఉంది.
అందుకే.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కనిపి స్తోంది. ఇప్పటి వరకు అంటే గత పదేళ్లలో తాను రాష్ట్రానికి ఏం చేశానని చెప్పుకొంటూ ఎన్నికలకు వెళ్ల కుండా.. ఈ నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందనే విషయాన్ని ఆయన ప్రజలకు వివరించను న్నారు. మరీ ముఖ్యంగా గత నెల రోజులుగా బీఆర్ ఎస్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అవలంభించిన విధానాలను కేసీఆర్ ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది.
బీఆర్ ఎస్ పార్టీని లేకుండా చేస్తారనే వాదనను ముందు పెట్టి.. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ గళాన్ని వినిపించిన పార్టీగా బీఆర్ ఎస్‌ను ఆయన ప్రొజెక్టు చేసుకునేందుకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా తమా పార్టీ నాయకులను కాంగ్రెస్, బీజేపీలు లాగేసుకుంటున్నాయని.. తద్వారా తనను రాజకీయంగా అణిచేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని కూడా కేసీఆర్ వివరించే ప్రయత్నం చేయొచ్చు.
తద్వారా మరోసారి సెంటిమెంటును రాజేసి.. రాష్ట్రంలో బీజేపీ పునాదులను పటిష్ఠ పరిచే దిశగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. దీంతో ప్రజల సింపతీని మరోసారి తనవైపు తిప్పుకోవడమే అజెండాగా కేసీఆర్ అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఆదివారం నుంచి కేసీఆర్ తన ప్రచారం ప్రారంభించనున్నారు. ఒకే రోజు మూడు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్టు బీఆర్ ఎస్ వర్గాలు చెప్పాయి.