Begin typing your search above and press return to search.

సారు వాడకమే వాడకమట..తిట్టాలన్నా.. దాచాలన్నా ఆంధ్రానేనా కేసీఆర్!

చిన్న విషయాలే కానీ పెద్ద ఎఫెక్టు చూపిస్తుంటాయి. తాజాగా వెలుగు చూసిన వైనం విపక్ష బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగిపోయే పంచ్ ఇచ్చినట్లైంది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 1:30 PM GMT
సారు వాడకమే వాడకమట..తిట్టాలన్నా.. దాచాలన్నా ఆంధ్రానేనా కేసీఆర్!
X

చిన్న విషయాలే కానీ పెద్ద ఎఫెక్టు చూపిస్తుంటాయి. తాజాగా వెలుగు చూసిన వైనం విపక్ష బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగిపోయే పంచ్ ఇచ్చినట్లైంది. ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేస్తే ఎంతలా ఉంటుందన్న విషయం తాజాగా ల్యాండ్ క్రూయిజ్ ఎపిసోడ్ తో అర్థమైందని చెప్పాలి. ఎలాంటి అర్భాటాలులేకుండా.. హడావుడి మాటలు చెప్పకుండా.. దుబారా ఖర్చు.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి.. ఆస్తుల పెంపకం అంటూ చెప్పే మాటలకు ఒకే ఒక్క ఉదాహరణతో నాకౌట్ చేసిన క్రెడిట్ ముఖ్యమంత్రి రేవంత్ కు దక్కినట్లుగా చెబుతున్నారు.

రేవంత్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రానికి పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేసిన గులాబీ పార్టీకి ముఖం ఎక్కడ దాచాలో కూడా అర్థం కాని విధంగా 22 విలాసవంతమైన కార్ల కొనుగోలు ఎపిసోడ్ ను చెప్పటం ద్వారా చేశారని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ తో మరో ఆసక్తికర వాదన తెర మీదకు వచ్చింది. తమ రాజకీయ ప్రయోజనం కోసం అవసరం ఉన్నా లేకున్నా ఆంధ్రా.. ఆంధ్రోళ్లు అంటూ విరుచుకుపడే కేసీఆర్ అండ్ కో.. చివరకు తాము ఏదైనా దాచుకోవాలన్నా కూదా ఆంధ్రానే వాడేయటమా? అంటూ విస్మయానికి గురి అవుతున్నారు.

నోరు తెరిస్తే ఆంధ్రా అంటూ ఆగ్రహాన్నివ్యక్తం చేస్తూ.. ఆంధ్రాతో తెలంగాణకు జరిగే నష్టం గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పే తండ్రీ కొడుకులు.. మేనల్లుళ్ల గురించి తెలిసిందే. అలాంటి వారు ప్రభుత్వం.. తాము కొనుగోలు చేసిన విలాసవంతమైన కార్లను రహస్యంగా ఆంధ్రాలో భాగమైన విజయవాడలో దాచి ఉంచటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇదంతా చూసినోళ్లు ఆంధ్రాను తిట్టటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందటమే చూశామని.. ఇలా రహస్య కొనుగోళ్లను దాచుకోవటానికి సైతం ఆంధ్రాను వాడేయటం చూస్తే.. ఆంధ్రాను వాడేయటంలో గులాబీ బాస్ తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రా పేరుతో భావోద్వేగాల్ని తట్టి లేపే కేసీఆర్ అండ్ కో తమ అవసరాల కోసం అదే ఆంధ్రాను అడ్డదిడ్డంగా వాడేయటం చూస్తే కేసీఆరా మజాకానా? అనిపించక మానదు.