Begin typing your search above and press return to search.

ఫేస్ టు ఫేస్... కేసీఆర్ నియోజకవర్గంలో రేవంత్ పోటీ?

దీంతో... ప్రస్తుతం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   21 Oct 2023 7:10 AM GMT
ఫేస్  టు ఫేస్... కేసీఆర్  నియోజకవర్గంలో రేవంత్  పోటీ?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా... అధికార బీఆరెస్స్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతోపాటూ మేనిఫెస్టోనూ ప్రజల్లోకి వదిలింది. ఇదే సమయంలో హుస్నాబాద్ వేదికగా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించింది.

మరోపక్క కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కధంతొక్కుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 55 మందితో తొలిజాబితా విడుదల చేసింది. తుదిజాబితా త్వరలో విడుదల చేస్తారని అంటున్నారు. మరోపక్క తెలంగాణలో రాహుల్ గాంధీ అవిరామంగా తిరుగుతున్నారు. ప్రజలపై హామీలవర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ - మోడీలను ఒకేగాటినకట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోపక్క బీజేపీ కూడా తన తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతోందని తెలుసుంది. ఫస్ట్ లిస్ట్ లో ఆల్ మోస్ట్ సీనియర్లను, అసంతృప్తులను అకామిడేట్ చేయబోతోందని అంటున్నారు. ఇవాళో, రేపో ఆ లిస్ట్ కూడా విడుదలవ్వొచ్చని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి కేసీఆర్ ను ఎలాగైనా గద్దె ఎక్కనివ్వకూడదని బలంగా ఫిక్సయిన కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయి. ఇందులో భాగంగా కేసీఆర్ ను నేరుగా ఢీకొట్టాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని తెలుస్తుంది!

అవును... ఈ సారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో గెలిచిన తరువాత ఏ స్థానంలో కొనసాగేది అప్పుడు నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలుకు చెబుతున్నారు. అయితే రెండు చోట్లా ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు! దీంతో... కేసీఆర్ లక్ష్యంగా కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇందులో భాగంగా... హుజూరాబాద్ లో పోటీలో నిలవనున్న ఈటెల రాజేందర్, గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పైన పోటీకి దిగనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ను నేరుగా ఢీ కొట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది. కొడంగల్ తో పాటుగా కామారెడ్డి నుంచి రేవంత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.

ఈ ప్లాన్ కోసమే కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రకటించలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ లిస్ట్ లో ఆల్ మోస్ట్ సీనియర్లందరినీ అకామిడేట్ చేసినప్పటికీ... కామారెడ్డికి షబ్బిర్ అలీకి ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం వెనుక అసలు కారణం ఇదే అని వినిపిస్తున్న కామెంట్లకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... కేసీఆర్ పై గజ్వేల్ లో బీజేపీ నుంచి ఈటెల పోటీకి దిగుతుండగా... కామారెడ్డిలో కూడా కేసీఅర్ పైకి బలమైన నేతను పోటీకి నిలబెట్టాలని బీజేపీ భావిస్తుందంట. ఇందులో భాగంగా విజయశాంతి పేరు వినిపిస్తుందని అంటున్నారు. అయితే.. కామారెడ్డిలో విపక్షాల నుంచి ఇద్దరూ బలమైన నేతలు పోటీకి దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, అది పరోక్షంగా కేసీఆర్ కు లాభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో... ప్రస్తుతం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లు బలంగా ఫిక్సయ్యాయని తెలుస్తుంది. మరి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ విపక్షాల వ్యూహాలు ఫలిస్తాయా.. లేక, కేసీఆర్ వార్ వన్ సైడ్ చేసేస్తారా అనేది వేచి చూడాలి.