Begin typing your search above and press return to search.

యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ మాస్ వార్నింగ్

తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా సంస్థలతో పాటు.. సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకోవటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 March 2024 11:30 PM GMT
యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ మాస్ వార్నింగ్
X

విజయం అవసరం లేని అహాన్ని తీసుకొస్తుంది. పరాజయం అప్పటివరకు లేని ఫస్ట్రేషన్ ను తీసుకొస్తుంది. అందుకే గెలుపు వేళ అనవసర ఆనందాన్ని.. పరాజయం వేళ అవసరం కాని ఆందోళనకు గురి కాకుండా బ్యాలెన్సు గా ఉండటం చాలా అవసరం. ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదే సమయంలో తమ లక్ష్యాన్ని మిస్ కాకుండా ఉంటారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే విమర్శలకు గురవుతారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చేయకూడని తప్పుల్ని పదే పదే చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా సంస్థలతో పాటు.. సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకోవటం తెలిసిందే.

గులాబీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయటం.. వారిని తెగ ఇబ్బందులకు గురి చేయటం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ తరహా కేసులు (కొన్ని స్టేషన్లు మినహాయిస్తే) నమోదైనట్లుగా పోలీసు వర్గాలు సైతం ఒప్పుకుంటాయి. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే.. తమపై చిన్నపాటి విమర్శతో పోస్టు పెట్టినా వారిపై కేసులు నమో

దు చేసి.. చర్యల కోసం పోలీసుల్ని పరుగులు తీయించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీఆర్ఎస్ అగ్రనేతల ఫండింగ్ తో కొన్ని యూట్యూబ్ చానళ్లు షురూ చేసి అందులో తమ ప్రత్యర్థులపై ఒక క్రమపద్దతిలో టార్గెట్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తాము అధికారంలో ఉన్నప్పుడు కొందరు పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాంపింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావటమే కాదు.. కేసులు నమోదై.. వరుస అరెస్టు జరుగుతున్న వేళ.. కేటీఆర్ లాంటి మేధావి నేత రాంగ్ టైమింగ్ లో యూట్యూబ్ చానళ్లకు మాస్ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.

తమపై కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని.. అలాంటి యూట్యూబ్ చానళ్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు.. తమపై అసత్య ప్రచారానికి దిగే యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావాలు వేయనున్నట్లుగా పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రతోనే ఈ యూట్యూబ్ ఛానళ్లపై వ్యవహారం మీద గూగుల్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై అధికారికంగా కంప్లైంట్ చేయటంతో పాటు.. వాటి ద్వారా ప్రచారమైన అంశాలపైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చేసిన వినతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ చానళ్లపైనే కాదు కొన్ని మీడియా సంస్థలపైనా న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లుగా తెలిపిన కేటీఆర్ హెచ్చరిక బూమ్ రాంగ్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓపక్క అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరును కేటీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి తామే అధికారంలో ఉన్నట్లుగా ఆయన మాటల ధోరణి తమపై మరింత వ్యతిరేకత పెరిగేలా చేస్తుందన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి మాస్ వార్నింగ్ ఇచ్చే వేళలో సమయం.. సందర్భం చూసుకోకుండా ఇస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు.

తమపై విష ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు తమ తీరు మార్చుకోవాలన్న కేటీఆర్.. ‘‘అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేస్తాం. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాం. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలి. ఇలాంటి కుట్రపూరిత చానళ్ల ప్రాపగాండా,, అసత్య ప్రచారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.