Begin typing your search above and press return to search.

బెడ్ రెస్ట్ లో ఉన్న కేసీఆర్ ఫోన్స్ తో బిజీ... కారణం ఇదే!

దీనికి అసలు కారణం.. పార్టీ పెద్దల స్వయంకృతాపరాధమే అని నొక్కి వక్కానిస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 12:30 AM GMT
బెడ్  రెస్ట్  లో  ఉన్న కేసీఆర్  ఫోన్స్  తో బిజీ... కారణం ఇదే!
X

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ కు గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. అయితే ఆ షాక్ చాలా మంది ఊహించిందే అని అంటుంటే... అస్సలు ఊహించలేదని మరికొంతమంది అంటున్నారు. ఊహించనివారి సంగతి కాసేపు పక్కనపెడితే... ఊహించిన వారు మాత్రం అందుకు గల కారణాలను స్పష్టంగా చెబుతున్నారని అంటున్నారు. దీనికి అసలు కారణం.. పార్టీ పెద్దల స్వయంకృతాపరాధమే అని నొక్కి వక్కానిస్తున్నారని అంటున్నారు.

ఈ విషయం ఇప్పటికే కేటీఆర్ ముందు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, సీనియర్లు ఓపెన్ గా చెప్పారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏర్పాటూ చేసిన మీటింగుల్లో ఈ విషయాలు స్పష్టంగా వెల్లడించడం.. అందుకు తప్పంతా తమదే అని కేటీఆర్ అంగీకరించడం కూడా జరిగిపోయింది! ఈ సమయంలో ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్న కేసీఆర్... కార్యకర్తలకు టచ్ లోకి వెళ్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా గతంలో జరిగిన పొరపాట్ల గురించి చర్చిస్తున్నట్లు చర్చ జరుగుతుంది.

అవును... కారణం ఏమిటన్న సంగతి కాసేపు పక్కనపెడితే... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్... కింది స్థాయి క్యాడర్ ను కాపాడుకునేందుకు, వారిలో నమ్మకం కలిగించేందుకు, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న ఆయన... ద్వితీయ శ్రేణ నేతలుకు ఫోన్లలో టచ్ లోకి వెళ్తున్నారంట. ఈ సందర్భంగా వారి కుశలం కనుక్కోవడంతోపాటు.. గతంలో జరిగిన పొరపాట్లను మరిచిపోయి ముందుకు సాగాలని, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉత్పన్నంకావని భరోసా ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే సుమారు అరవై నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచించడం వల్ల కేడర్ ను పట్టించుకోలేకపోయాయని, మరోసారి అలాంటి పొరపాటు జరగదని కేసీఆర్ వారితో అంటునారని తెలుస్తుంది. ఇదే సమయంలో తనతో వారి వారి అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించేందుకు కూడా స్పెస్ కల్పిస్తున్నారని తెలుస్తుంది.

దీంతో... పార్టీ ద్వీతియ శ్రేణి నేతలు ఓపెన్ అయిపోతున్నారని సమాచారం. ఇందులో భాగంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరూ కేడర్ ను పరిట్టించుకోలేదని.. ద్వితీయ శ్రేణి నేతలకు కూడా విలువ ఇవ్వకుండా... నియోజకవర్గాల్లో కుటుంబ పాలనకు తెరలేపారని.. కష్టపడిన వారికి ప్రయోజనం, విలువ లేకుండా చేశారని.. ఫలితంగా నియోజకవర్గాల్లో గ్రూపులు ఏర్పడి ఇలాంటి ఫలితాలు వచ్చాయని వారు గుక్కతిప్పుకోకుండా సమస్యలు వివరిస్తున్నారని తెలుస్తుంది.

దీంతో విషయం పూర్తిగా గ్రహించిన కేసీఆర్... క్యాడర్ లో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఫిబ్రవరి నుంచి తాను అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని భరోసా ఇచ్చారని తెలుస్తుంది. దీంతో... స్థానిక నేతలపై ఆగ్రహంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు నేరుగా కేసీఆరే భరోసా ఇచ్చేసరికి కూల్ అయ్యారని.. ఆ ఉత్సాహం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు!