నిర్మాత కేదార్ కు అప్పిచ్చిన నిర్మాతలు, పొలిటీషియన్ల సంగతేంటి?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ వీడడం లేదు. దుబాయ్‌లో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 28 Feb 2025 11:07 AM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ వీడడం లేదు. దుబాయ్‌లో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, అధికారికంగా పోస్టుమార్టం రిపోర్ట్ వెలువడే వరకు ఆయన మరణం వెనుక అసలు కారణాలు తెలియవు. ఈ సంఘటన చిత్రపరిశ్రమలో కలకలం రేపుతోంది.
- రూ.100 కోట్ల డబ్బు.. మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతల్లో ఆందోళన
కేదార్ వద్ద కొందరు మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతలు భారీ మొత్తంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కేదార్ కు సుమారు 100 కోట్లకు పైగానే అప్పులు ఉన్నట్టు సినీ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అతడు చేసే వ్యాపారాల్లో మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఇందులో పొలిటికల్ లీడర్స్, నిర్మాతలు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే నిర్మాత కేదార్ అకస్మాత్తుగా మరణించడంతో ఈ మొత్తాన్ని తిరిగి పొందడం ఎలా అన్న విషయంలో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం
కేదార్ మృతి విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింతగా రాజకీయ వేడి రాజేశాయి. పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు తమ డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో పడిపోయారు.
- పోలీసుల దర్యాప్తు కీలకం
కేదార్ మృతి వెనుక ఎలాంటి ఆర్థిక, రాజకీయ కోణాలున్నాయా? దుబాయ్ అధికారులతో పాటు భారత ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు మరింత లోతుగా వెళ్లే అవకాశముండటంతో సినీ, రాజకీయ రంగాల్లో చర్చలు ముమ్మరం అయ్యాయి. కేదార్ మృతితో బయటకు వచ్చే మరిన్ని విషయాలు ఏంటి? మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతల 100 కోట్ల డబ్బు వాస్తవమేనా? తిరిగి వస్తాయా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.