కేజ్రీవాల్‌పై యాసిడ్ దాడి.. ఢిల్లీలో సంచలన ఘటన!
ఈ నేపథ్యంలో ఆయన పలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 Nov 2024 6:28 PM GMTదేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ దుండగుడు యాసిడ్ దాడి చేశారు. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో కేజ్రీవాల్.. ఇప్పటి నుంచే పని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు తమ ప్రభుత్వం చేసిన మేళ్లను వివరిస్తున్నారు.
ఇదే సమయంలో కేంద్రం తనను అన్యాయంగా అరెస్టు చేసిన కేసులు పెట్టిన విషయాన్ని కూడా చెబు తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన గ్రేటర్ కైలాష్ ప్రాంతం పాదయాత్ర నిర్వహించారు. సాయం త్రం 6 గంటల సమయంలో స్థానికులను కలుసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సయమంలో ఆప్ కార్యకర్తల్లో కలిసి పోయిన ఓ వ్యక్తి కేజ్రీవాల్ సమీపంలోకి వచ్చారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సమయంలో తాను అప్పటి కే తెచ్చుకున్న ఓ బాటిల్‌లోని ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై పోశారు.
ఈ షాకింగ్ ఘటనతో కేజ్రీవాల్ ఉలిక్కిపడ్డారు. ఈ ద్రావణం కేజ్రీవాల్ శరీరంపైనా.. ఆయన దుస్తులపైనా పడింది. వెంటనే అలెర్ట్ అయిన కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది, ఆప్ కార్యకర్తలు దుండగుడిని పట్టుకుని చితక్కొట్టారు. ఈ ఘటనలో కేజ్రీవాల్ స్వల్పంగా గాయపడ్డారు. హఠాత్పరిణామంతో ఆయన ఉలిక్కి పడి.. తేరుకోలేక పోయారు. దుండగుడిని అరెస్టు చేసిన గ్రేటర్ కైలాష్ పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారించారు. అతను వాడింది.. యాసిడ్డేనని నిర్ధారించారు.
అయితే.. అది అంత ప్రభావవంతం కాదని.. చర్మం కాలిపోయే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అయినప్ప టికీ.. మాజీ సీఎం పై అంత ధైర్యంగా దాడి చేయడం వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ దాడి ఘటనతో కేజ్రీవాల్ తన పర్యటనను నిలుపుదల చేసుకుని.. ఆసుపత్రికి వెళ్లారు. మరోవైపు ఈ ఘటన రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. దీని వెనుక.. ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆప్ నాయకులు ఆరోపించారు. అయితే.. తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రకటించడం గమనార్హం.