Begin typing your search above and press return to search.

వామ్మో... కేజ్రీవాల్ కోమాలోకి వెళ్లే ప్రమాదం?

వాస్తవానికి ఈడీ నమోదు చేసిన కేసులో శుక్రవారమే సుప్రీంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు అయినప్పటికీ... సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులో అరెస్ట్ అవ్వడంతో ఆయన జైల్లోనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 July 2024 1:47 PM GMT
వామ్మో... కేజ్రీవాల్  కోమాలోకి వెళ్లే ప్రమాదం?
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈడీ నమోదు చేసిన కేసులో శుక్రవారమే సుప్రీంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు అయినప్పటికీ... సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులో అరెస్ట్ అవ్వడంతో ఆయన జైల్లోనే ఉన్నారు.

అవును... మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడంతో ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై ఆప్ ఎంపీ స్పందించారు.

ఇందులో భాగంగా... కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభిస్తుందేమో అనే అనుమానంతోనే సీబీఐ మరో కల్పిత కేసు పెట్టిందని.. ఈ విధంగా తప్పుడు కేసులుపెడుతూ కేంద్రం ఆయన జీవితంతో ఆడుకుంటోందని విమర్శించారు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్. ఈ సమయంలోనే కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ 8.5కిలోల బరువు తగ్గారని, ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తోందంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీ షుగర్ లెవెల్ 50ఎంజీ స్థాయికి పడిపోయిందని.. ఇది ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందని అంటున్నారు.

వాస్తవానికి మార్చి 21న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన బరువు 70 కిలోలు ఉందని చెప్పిన సంజయ్ సింగ్... ఇప్పుడు ఆయన బరువు 61.5 మాత్రమే అని వాపోయారు. ఈ క్రమంలోనే సుమారు ఐదుసార్లు కేజ్రీవాల్ షుగర్ లెవెల్ 50 ఎంజీ/డీఎల్ కంటే తక్కువకు వెళ్లిందని, తరచూ ఇలా జరిగితే కోమాలోకి వెళ్లే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.