Begin typing your search above and press return to search.

అదానీకి గ్యాప్ ఇవ్వడం లేదు... ఇప్పుడు మరోదేశం నుంచి షాక్!

ఇక ఈ వ్యవహారం భారతదేశ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   22 Nov 2024 3:52 AM GMT
అదానీకి గ్యాప్  ఇవ్వడం లేదు... ఇప్పుడు మరోదేశం నుంచి షాక్!
X

భారతదేశంలో రెండో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరు అయిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం అటు భారత్ తో పాటు ఇటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోనూ హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారం భారతదేశ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అదానీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అతనికి ఏమీ కాదు.. మోడీ రక్షిస్తాడు అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేస్తుండగా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రలతోనే అదానీ ఒప్పందాలని.. అక్కడ ఎంతెంత లంచాలు ఇచ్చారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని అంటున్నారు బీజేపీ నేతలు. ఎలక్షన్ టైం కాకపోతే రాష్ట్రాల్లో అవినీతి జరిగితే కేంద్రం పట్టించుకోదా? బీజేపీ నేతలకే తెలియాలని అంటున్నారు.

మరోపక్క ఏపీ రాజకీయాల్లోనూ ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అదానీ సంస్థల నుంచి రూ.1,750 కోట్లు లంచం అందిందని సాక్ష్యత్తు అమెరికా దర్యాప్తూ సంస్థే నిర్ధారణకు వచ్చిందంటూ కథనాలు పెద్ద ఎత్తున మొదలైపోయాయి. ఈ సమయంలో మరో దేశం అదానీకి షాకిచ్చింది.

అవును... లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీపై కేసు నమోదవ్వడంతో మరో పక్క కెన్యా సర్కార్ కూడా అదానీ గ్రూపునకు షాకిచ్చింది. ఇందులో భాగంగా... ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ సహా, విదుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుటో ఈ విషయాన్ని వెల్లడించారు.

వాస్తవానికి విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి సంబంధించి పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్య సర్కార్ అదానీ గ్రూపుతో 736 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో కేసు నేపథ్యంలో ఈ ఒప్పందానికి ఇప్పుడు బ్రెక్ పడినట్లు ప్రకటించింది.

ఇదే సమయంలో... కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు అదానీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఐతే.. అప్పట్లో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని తాత్కాలికంగా నిలిపేసింది అక్క్డి ప్రభుత్వం. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో పూర్తిగా రద్దు చేసింది.