Begin typing your search above and press return to search.

కేరళ ర్యాగింగ్ హారర్: మర్మాంగాలపై డంబెల్స్.. కంపాస్ తో గుచ్చటం

తాజాగా చెప్పేది కూడా ఆ కోవకే వస్తుంది. కేరళలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో చోటు చేసుకున్న ర్యాగింగ్ టెర్రర్ గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

By:  Tupaki Desk   |   13 Feb 2025 4:27 AM GMT
కేరళ ర్యాగింగ్ హారర్: మర్మాంగాలపై డంబెల్స్.. కంపాస్ తో గుచ్చటం
X

ఎవరెంత చెప్పినా దేశంలోని పలు కాలేజీల్లో గుట్టుచప్పుడు కాకుండా ర్యాంగింగ్ కంటిన్యూ అవుతుంది. పరిచయం పేరుతో సాగే ఈ అమానుషకాండకు సంబంధించి కొన్నిసార్లు షాకింగ్ ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి.తాజాగా చెప్పేది కూడా ఆ కోవకే వస్తుంది. కేరళలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో చోటు చేసుకున్న ర్యాగింగ్ టెర్రర్ గురించి తెలిస్తే నోట మాట రాదంతే. జూనియర్లు పట్ల సీనియర్లు వ్యవహరించిన తీరు.. వారిని పెట్టిన హింస గురించి తెలిస్తే.. వీళ్లు విద్యార్థులేనా? అన్న భావన కలుగక మానదు.

అత్యంత క్రూరంగా.. అమానుషంగా జూనియర్లను హింసిస్తున్న ఐదుగురు సీనియర్లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన ఆరాచకం గురించి జూనియర్ విద్యార్థులు వాపోయారు. గడిచిన మూడునెలలుగా ర్యాంగింగ్ పేరుతో సాగుతున్న ఈ రచ్చ గురించి వారు చెబుతూ.. ‘‘జూనియర్లను నగ్నంగా నిలబెట్టటం.. భౌతికంగా హింసిచంటం లాంటివి చేసేవారు’’ అంటూ వారి అరాచకం గురించి వివరంగా చెప్పుకొచ్చారు.

‘‘విద్యార్థుల మర్మాంగాలపై డంబెల్స్ పెట్టేవారు. కంపాస్ లోని వస్తువులతో ప్రైవేటు భాగాలపై గుచ్చేవారు. చివరకు గాయాలకు లోషన్ రాసేవారు.దీంతో పాటు ముఖాలకు.. నోళ్లకు.. తలలకు క్రీమ్ రాసుకోవాలని ఆదేశించేవారు. తరచూ డబ్బులు లాక్కునేవారు. ఆ డబ్బులతో లిక్కర్ కొనుగోలు చేసేవారు’’ అంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణ ర్యాగింగ్ ఉదంతం వెలుగు చూసింది.

డిసెంబరు 13న జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు దారుణంగా హింసించారని.. ఆ రోజురాత్రి జరిగినఅరాచకం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే.. ‘‘ఆ రోజు రాత్రి జూనియర్ గదుల్లోకి సీనియర్లు వచ్చారు. కాళ్లు.. చేతలను తాళ్లతో కట్టేశారు. అనంతరం లోషన్ ను ఒంటిపై పోశారు. డివైడర్ తో గాయాలు చేశారు.దీనంతటినీ వీడియో తీయాలని మరో జూనియర్ ను ఆదేశించారు’’ అని పేర్కొన్నారు. సీనియర్లు పెట్టే హింసను తట్టుకోలేకపోయిన ముగ్గురు జూనియర్లు కొట్టాయంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడుతున్న థర్డ్ ఇయర్్ కు చెందిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. కేరళ ర్యాగింగ్ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.