కేరళ రాష్ట్రం పేరు మార్పు...కొత్తపేరు ఇదే!
రాష్ట్రం పేరు మార్చడానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 9 Aug 2023 12:32 PM GMTరాష్ట్రం పేరు మార్చడానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రం పేరు మారుస్తూ ప్రభుతం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అనంతరం కేరళ రాష్ట్ర పేరును మార్చాలని కోరుతూ కేంద్రానికి తీర్మానాన్ని పంపింది.
అవును... కేరళ రాష్ట్ర పేరును మార్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో కేరళ రాష్ట్ర పేరును "కేరళం"గా మారుస్తూ ప్రభుత్వ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీంతో కేరళ రాష్ట్ర పేరును "కేరళం" మార్చాలని కోరుతూ కేంద్రానికి తీర్మానాన్ని పంపింది.
ఈ సందర్భంగా రాజ్యాంగ సవరణ చేసి కేరళ పేరును కేరళం గా మార్చాలని కోరింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ శాసనసభలో విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన రూల్ - 118 కింద తీర్మానంలోని అంశాలను సభలో సమర్పించారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ కూడా రాష్ట్రం పేరును “కేరళ”గా నిర్దేశించింది.
మలయాళంలో "కేరళం" అనేది ఆమోదించబడిన, సాధారణ వాడుక అయితే... అధికారిక రికార్డులలో, ముఖ్యంగా ఇంగ్లీషులో రాష్ట్రాన్ని సాధారణంగా "కేరళ"గా పేర్కొనడం జరుగుతోంది. "కేరళప్పిరవి" దినోత్సవాన్ని కూడా నవంబర్ 1న జరుపుకుంటారు. కారణం... రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన 1956 - నవంబర్ 1న పునర్వ్యవస్థీకరించబడ్డాయి.
రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ రాష్ట్రం పేరును "కేరళ"గా పేర్కొంటుంది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం "కేరళం"గా సవరించడానికి తక్షణ చర్యలు అవసరమని తీర్మానం పేర్కొంది. అవును... రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణ ద్వారా కొత్త రాష్ట్రాల ఏర్పాటు.. రాష్ట్రాల సరిహద్దుల మార్పులు.. రాష్ట్రాల పేర్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.