Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా పోర్న్ చూడటం పర్సనల్.. తేల్చిన ఆ రాష్ట్ర హైకోర్టు

సీక్రెట్ గా పోర్న్ వీడియోలు చూడటం వ్యక్తిగతమని తేల్చేసింది కేరళ హైకోర్టు. అలాంటి ఉదంతాలపై కేసులు కట్టటం చట్టరీత్యా నేరం కాదన్న విషయాన్ని స్పష్టం చేసింది

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:17 AM GMT
సీక్రెట్ గా పోర్న్ చూడటం పర్సనల్.. తేల్చిన ఆ రాష్ట్ర హైకోర్టు
X

గుట్టుగా పోర్న్ వీడియోలు చూస్తే ఏమవుతుంది? ఎవరూ లేని చోట.. ఒంటరిగా బూతు వీడియోల్ని చూస్తున్న వేళ.. పోలీసులు పట్టుకొని కేసు పెడితే పరిస్థితి ఏంటి? కోర్టు అలాంటి చర్యలకు ఇచ్చే తీర్పులు ఏ రీతిలో ఉంటాయన్న సందేహం పలువురిని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి కేసులో తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇంతకూ ఏమని తీర్పు ఇచ్చిందన్న విషయంలోకి వెళితే..

సీక్రెట్ గా పోర్న్ వీడియోలు చూడటం వ్యక్తిగతమని తేల్చేసింది కేరళ హైకోర్టు. అలాంటి ఉదంతాలపై కేసులు కట్టటం చట్టరీత్యా నేరం కాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ.. అలా చేస్తున్న వారిపై కేసులు కడితే.. వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకున్నట్లే అవుతుందని వెల్లడించింది. ఒంటరిగా ఉంటూ సీక్రెట్ గా పోర్న్ వీడియోల్ని చూసే వారిని అడ్డుకోవటం.. కేసులు పెట్టటం వ్యక్తిగత స్వేచ్ఛను అపహరించినట్లేనని తేల్చింది.

అంతేకాదు.. పోర్నోగ్రఫీ అన్నది శతాబ్దాలుగా సాగుతోందని.. డిజిటల్ యుగంలో అది మరింత విస్త్రతమైందన్న హైకోర్టు.. ఈ తరహా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై నమోదు చేసిన కేసును కొట్టేసింది. 2016లో కొచ్చిలోని అలువా ప్యాలెస్ సమీపంలో రోడ్డు పక్కన 33 ఏళ్ల వ్యక్తి పోర్న్ వీడియోలు చూస్తూ పోలీసులకు దొరికాడు. అతనిపైన ఐపీసీ 292 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై కేరళ హైకోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేసిన కేరళ కోర్టు.. వ్యక్తిగతంగా పోర్న్ చూసే వారిది వ్యక్తిగతమని తేలుస్తూ.. కేసును కొట్టేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది.