Begin typing your search above and press return to search.

భార్య లేచిపోయింది... ఫ్రెండ్స్ తో భర్త పండగే పండగ!

అవును... తన భార్య, ఆమె ప్రియుడితో లేచిపోవడంతో.. ఆ భర్త ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది!

By:  Tupaki Desk   |   10 Oct 2023 1:30 AM GMT
భార్య లేచిపోయింది... ఫ్రెండ్స్  తో భర్త పండగే పండగ!
X

ఒకప్పుడు భార్యాభర్తల బంధం గురించి ఎంతోగొప్పగా చెప్పేవారు. మరింత వెనక్కి వెళ్తే... అవి ఇప్పుడు వింటే ఏమాత్రం నమ్మశక్యం కాదనే అభిప్రాయం కలిగినా ఆశ్చర్యం లేదని అంటారు. కొంతమంది విషయంలో దాంపత్యం జీవితం, సంసార సంబంధం అంతలా దిగజారిపోయిందని చెబుతుంటారు.. అంతలా మంటగలిసిపోయిందని అంటుంటారు. ఈ క్రమంలో మరింత దిగజారిపోయిందనే కామెంట్లకు బలం చేకూర్చే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

"మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది" సినిమాల్లోని సీన్ లాంటి సంఘటన తాజాగా జరిగింది. అయితే... ఈ సందర్భంగా ఇంట్లో నుంచి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య గురించి ఆమె భర్త ఏమాత్రం హర్ట్ అవ్వలేదు.. ఎలాంటి అగాయిత్యానికీ పాల్పడలేదు.. పండగ చేసుకున్నాడు! అది కూడా ఒంటరిగా కాదు సుమా... 250 మందికి పైగా స్నేహితులతో!

అవును... తన భార్య, ఆమె ప్రియుడితో లేచిపోవడంతో.. ఆ భర్త ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది! దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని కోజికోడ్‌ లో జరిగిందని తెలుస్తోన్న ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించినది భావిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో చాలా మంది మద్యం తాగుతూ డాన్స్ చేస్తున్నట్లున్నారు. ఇదే సమయంలో మోహన్‌ లాల్ సినిమా "నరన్" లోని పాటకు డాన్స్ చేశారు. ఓ ఇంటి ఆవరణలో ఈ పార్టీ జరిగినట్లు కనిపిస్తుంది.

అయితే ఈ వీడియో వాస్తవమేనా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. కానీ, దీనికి సంబంధించిన ఈ వీడియో క్యాప్షన్ మాత్రం "భార్య లేచిపోయింది.. భర్త 250 మందికి మద్యం, ఆహారం పెట్టి వేడుక చేసుకుంటున్నాడు" అని రాసి ఉంది. ఇక ఈ వీడియోని అక్టోబర్ 6, 2023న ఫేస్‌ బుక్‌ లో షేర్ చెయ్యగా.. ఇప్పటికే సుమారు 10 లక్షల మందివరకూ చూసినట్లు తెలుస్తుంది. ఈ స్థాయిలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.