Begin typing your search above and press return to search.

రెండు రోజులపాటు లిఫ్ట్ లో ఉన్న వ్యక్తి.. ఏమయ్యాడో తెలుసా?

అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మాల్స్ వరకు.. ఆఫీస్ దగ్గర నుంచి సినిమా థియేటర్స్ వరకు.. ఎక్కువగా మనం లిఫ్ట్‌ని ఉపయోగిస్తాము

By:  Tupaki Desk   |   15 July 2024 10:30 AM GMT
రెండు రోజులపాటు లిఫ్ట్ లో ఉన్న వ్యక్తి.. ఏమయ్యాడో తెలుసా?
X

మెట్ల ఎక్కడం కంటే లిస్టులో వెళ్లడం మనలో చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు అయితే మెట్లు పర్లేదు అంతకంటే పైకెక్కాలంటే ఖచ్చితంగా లెఫ్ట్ కావాల్సింది. అందరికీ ఎంతో కన్వీనియెంట్‌గా ఉండే లిఫ్ట్ వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలా ఓ లిఫ్ట్ రెండు రోజుల పాటు తెచ్చుకోలేదు. మరి అందులో ఉన్న మనుషుల పరిస్థితి ఏమిటో తెలుసుకుందామా..

అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మాల్స్ వరకు.. ఆఫీస్ దగ్గర నుంచి సినిమా థియేటర్స్ వరకు.. ఎక్కువగా మనం లిఫ్ట్‌ని ఉపయోగిస్తాము. అయితే ఇలాంటి లిఫ్ట్ ఒక వ్యక్తికి భయానక అనుభవాన్ని మిగిల్చింది. రెండు రోజులపాటు ఆ లిఫ్టులో ఒంటరిగా అతను ఇరుక్కుపోయాడు. వినడానికే భయం పుట్టిస్తున్న ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? లిఫ్ట్‌లో ఎలా ఇరుక్కున్నాడు? ఎలా బయటపడ్డాడు చూద్దాం పదండి..

కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉళ్ళూరు ప్రాంతానికి చెందిన రవీంద్రన్ నాయర్ అనే వ్యక్తి గత శనివారం మెడికల్ చెక్ అప్ కోసం వెళ్లారు. 59 సంవత్సరాల వయసు కలిగిన రవీంద్రన్ నాయర్ అవుట్ పేషంట్ బ్లాక్‌లోని మొదటి అంతస్థకు వెళ్లడం కోసం లిఫ్టును ఉపయోగించారు. బటన్ నొక్కిన వెంటనే పైకి వెళ్లాల్సిన లిఫ్ట్ కాస్త ఒక్కసారి బలంగా ఊగింది. అదే సమయానికి అతని ఫోన్ కిందపడి పగిలిపోయింది. లిఫ్టులో ఇరుక్కున్న రవీంద్రన్ తాను లిఫ్ట్‌లో ఉన్న అన్న విషయం కూడా ఎవరికీ చెప్పే అవకాశం లేకుండా పోయింది.

లోపల ఉన్న రవీంద్రన్ సహాయం కోసం ఎంత గట్టిగా అరిచినా బయట ఎవ్వరికీ వినిపించలేదు. దీంతో అసలు లిఫ్ట్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు అన్న విషయం కూడా ఎవరికీ తెలియలేదు. హాస్పిటల్ సిబ్బంది కూడా లిఫ్ట్ పనిచేయడం లేదు అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. అలా శనివారం, ఆదివారం గడిచిపోయాయి. చివరకు సోమవారం ఉదయానికి ఆ లిఫ్ట్‌లో ఒక వ్యక్తి ఇరుక్కున్నాడు అన్న విషయం హాస్పిటల్ సిబ్బందితోపాటు అందరికీ తెలిసింది.

ఉదయం రొటీన్ వర్క్ కోసం హాస్పిటల్‌కి వచ్చిన లిఫ్ట్ ఆపరేటర్..లిఫ్ట్ పనిచేయడం లేదు అని గుర్తించి రిపేర్ చేసి లిఫ్ట్ డోర్ తెరిచాక అందులో స్పృహ తప్పి పడిపోయిన రవీంద్రన్ కనిపించాడు. దీంతో వెంటనే రవీంద్రన్‌ను వార్డుకు తరలించి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు లిఫ్ట్ పని చేయడం లేదు అన్న విషయాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది గుర్తించలేదు అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు శనివారం హాస్పిటల్‌కు చెకప్ కోసం ఇంటి నుంచి వచ్చిన రవీంద్రన్ తిరిగి ఇల్లు చేరకపోవడం, ఎంతసేపు ప్రయత్నించినా అతని ఫోన్ కలవకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. రెండు రోజుల లిఫ్ట్‌లో ఉండి కూడా ప్రాణాలతో బయటపడ్డ రవీంద్రన్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.