20/18 : కేరళలో యూడీఎఫ్ హవా
2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మొత్తం 20 ఎంపీ స్థానాల్లో యూడీఎఫ్ కూటమి 18 స్థానాల్ని కైవసం చేసుకుంది.
By: Tupaki Desk | 5 Jun 2024 4:58 AM GMTకేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ కూటమికి భారీ విజయం దక్కింది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇక్కడ రిపీట్ అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మొత్తం 20 ఎంపీ స్థానాల్లో యూడీఎఫ్ కూటమి 18 స్థానాల్ని కైవసం చేసుకుంది. వామపక్షాల నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి ఒక్క స్థానానికే పరిమితమైంది.
బీజేపీ తొలిసారిగా ఇక్కడ త్రిసూర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ వయనాడ్ నియోజకవర్గంలో రెండోసారి 6,47,445 ఓట్లతో గెలుపొందారు. తిరువనంతపురం స్థానంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ 16,077 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మీద విజయం సాధించారు.
కేరళలో ఈ సారి ఎలాగైనా బోణికొట్టాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరింది. ప్రముఖ నటుడు సురేశ్ గోపి త్రిసూర్ నియోజకవర్గంలో 74,686 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సునీల్‌కుమార్‌పై విజయం సాధించారు. రాజ్యసభ ఎంపీగా సురేశ్ గోపీ మూడేండ్లపాటు త్రిసూర్‌పై దృష్టిసారించటం తాజా గెలుపునకు బాటలు వేసింది.