కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి ఆయన రైట్ హ్యాండ్ కేకే
ఈ నెల 30న హస్తం కండువా కప్పుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ నేతలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
By: Tupaki Desk | 28 March 2024 3:30 PM GMTబీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈనెల 30న హస్తం కండువా కప్పుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ నేతలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పార్టీ మార్పుపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు.
హైదరాబాద్ నగర మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. దీంతో తండ్రి కూడా అదే బాటలో వెళ్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా కేకే పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై అధినేతతో సంప్రదింపులు జరిపేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కేకే మొత్తానికి పార్టీ మారి తన భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని చూస్తున్నారు.
గతంలో కూడా కాంగ్రెస్ లో కొనసాగిన కేకే ఇప్పుడు సొంత గూటికే చేరుతున్నారు. బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ అయి అధినేత ఆమోదం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేకే పార్టీ మార్చి కాంగ్రెస్ లో కొనసాగేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ తో భవిష్యత్ సున్నా అని తెలియడంతో కేకే నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.
కేశవరావు నిర్వాకంతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. ఒక్కొక్కరుగా వెళ్తుండటంతో నేతల్లో గుబులు పట్టుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే విధంగా నేతలన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆ తంతు కాంగ్రెస్ కు వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంపై భగ్గుమంటున్నారు. మేం గేట్లు తెరిచామని చెబుతున్నారు కానీ మేం కూడా అదే బాటలో ప్రయాణిస్తే ఎలాఉంటుందో చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల నిర్వాకంపై కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.