Begin typing your search above and press return to search.

కేకే పార్టీని ఎందుకు వీడారు? అసలేం జరిగింది?

కానీ నమ్మిన వారి మాటను తూచ తప్పకుండా పాటించి స్వామిభక్తిని చాటుకోవడం సహజమే.

By:  Tupaki Desk   |   29 March 2024 6:51 AM GMT
కేకే పార్టీని ఎందుకు వీడారు? అసలేం జరిగింది?
X

అంతటా నానిన కాని అరికాలు కింద నానలే అని తాబేలు నక్కను బోల్తా కొట్టించిందట. అందుకే నక్కెత్తులన్ని నాదగ్గర ఉండగా తప్పించుకుపోయెరా తాబేలు బుర్ర అంటారు. లోకంలో ఎవరికైనా కొందరు నమ్మకస్తులుంటారు. వారి మాటే వేదం. వారు చెప్పిందే శాసనం. ఇతరులు ఎన్ని చెప్పినా వారి మాటలు బుట్టదాఖలే చేస్తారు. కానీ నమ్మిన వారి మాటను తూచ తప్పకుండా పాటించి స్వామిభక్తిని చాటుకోవడం సహజమే. అలా మన వారు అనుకున్న వారి మాటలను ఎవరు జవదాటరు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అయినా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని, హోం మంత్రులదే తుది తీర్పు. వారి అభీష్టం మేరకు నిర్ణయాలు జీవోలుగా మారతాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సీఎం జగన్ నిర్ణయాలను తన ప్రధాన అనుచరులతో చర్చించి తరువాతే అమలు చేస్తారట. ఇలా ఎవరికి కావాల్సిన వారిని వారు తమ నమ్మకానికి అమ్మ వంటి వారుగా భావించడం జరుగుతుంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేశవరావును నమ్మినంతగా ఎవరిని కూడా నమ్మలేదు. దీంతో ఆ పదేళ్ల కాలంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేకే ఉండాల్సిందే. కేకేకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కేకే పార్టీ మారడంతో కేసీఆర్ ఖంగుతిన్నారు. నమ్మిన తనకే ద్రోహం చేశాడని వాపోతున్నారు. పలు సందర్భాల్లో కేకేతో చర్చించాకే తుది నిర్ణయం వస్తుందని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేశవరావు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్ర వాదిగా ముద్ర పడ్డారు. తన ఎత్తులతో కేసీఆర్ ను చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వారిని కూడా కేసీఆర్ కు దూరం చేశారు. ఇలా కేకే తన చాతుర్యంతో కేసీఆర్ ను మచ్చిక చేసుకుని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ప్రాజెక్టులైనా ఇంకేదైనా కేకే ఆమోదం లేనిది ఏది ముందుకు సాగలేదు. అలా కేసీఆర్ కు గుండెకాయలా ఉన్న కేకే ఇప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ కావడం అందరిని కలచివేసింది. గతంలో కూడా కేకే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన నేతగా పరిచయాలు ఉండటంతోనే ఇలా పార్టీని విడిచిపెట్టారని అంటున్నారు. ప్రతి విషయానికి కేకే ను పక్కన పెట్టుకున్న కేసీఆర్ కు తగిన శాస్తి జరిగిందని చెబుతున్నారు.

బీఆర్ఎస్ లో సెకండ్ స్థాయి నేతలకు తగిన గుర్తింపు ఉండదు. మొదట ఆలె నరేంద్ర పార్టీకి రెండో స్తంభంగా ఉన్నా తరువాత కాలంలో ఆయనను పార్టీకి దూరం చేశారు. తరువాత విజయశాంతి సెకండ్ లీడర్ అనుకున్నా ఆమె కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు కేకే వంతయింది. బీఆర్ఎస్ లే సెకండ్ నెంబర్ అచ్చిరాదనే విషయం అందరికి విధితమే. ఇలా అందరు బీఆర్ఎస్ ను వీడిపోతుంటే చివరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని అంటున్నారు రాజకీయ నిపుణులు.