Begin typing your search above and press return to search.

విజయవాడ ఎంపీ సీటు...ఆయనకు బాబు హామీ....?

ఇవన్నీ చూస్తూంటే మాత్రం చిన్ని 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2023 10:28 AM GMT
విజయవాడ ఎంపీ సీటు...ఆయనకు బాబు హామీ....?
X

విజయవాడ రాజకీయ రాజధాని. ఉమ్మడి ఏపీలో కూడా బెజవాడ వేదికగానే రాజకీయాలు సాగుతూ వచ్చాయి. విభనన ఆంధ్రాలో విజాయవాడ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. విజాయవాడ ఎంపీ సీటుకు చూస్తే ఎపుడూ ఒక గ్లామర్ ఉంది. ఎంతో మంది ఎంపీలుగా పనిచేశారు.

అలాంటి సీటులో ఎవరిని అభ్యర్ధిగా ఎంపిక చేసే విషయంలో రాజకీయ పార్టీలు ఆచీ తూచీ వ్యవహరిస్తాయి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఈ నేపధ్యంలో చూసుకుంటే విజయవాడ ఎంపీ సీటు టీడీపీకి కంచుకోటగా మారింది. ఆ పార్టీ 2014, 2019లలో వరసగా గెలుస్తూ వస్తున్న సీటుగా ఉంది.

జగన్ వేవ్ లో సైతం కేశినేని నాని ఇక్కడ నుంచి గెలిచారు. అయితే ఆయనకు హై కమాండ్ కి గ్యాప్ వచ్చిందని ప్రచారంలో ఉంది. దాంతో నాని సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఈ క్రమంలో చిన్ని ఇటీవల కాలమో జోరు చేస్తున్నారు. చిన్ని రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు.

ఆయన వరసబెట్టి సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. అదే టైం లో పార్టీ క్యాడర్ తో కూడా కలుస్తూ విజయవాడ పార్లమెంట్ పరిధి అంతటా తన హవా చాటుకుంటున్నారు. ఎన్టీయార్టీ శత జయంతి ఉత్సవాలను ఆయన నిర్వహిస్తూ టీడీపీ లోకల్ లీడర్లకు టచ్ లో ఉంటున్నారు.

మరో వైపున ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీల మధ్య పొత్తులు ఉంటాయని అంటున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీలో సందడి మొదలైంది. కేశినేని చిన్ని కూడా అధినాయకత్వం నుంచి టికెట్ హామీని పొంది ఉంటారని అందుకే ఆయన జనంలోకి జోరుగా వస్తున్నారని అంటున్నారు. కేశినేని నాని సిట్టింగ్ ఎంపీగా ఉండగానే టీడీపీకి చెందిన ఏడు నియోజకవర్గాల నేతలు అంతా నానితోనే చెట్టాపట్టాల్ వేసుకోవడం పట్ల కూడా చర్చ సాగుతోంది

ఇక అధినయాకత్వం కూడా అర్ధం బలం అంగబలం దండీగా ఉన్న నాని వైపు మొగ్గు చూపుతోందని, అందుకే ఆయనకు ఇండైరెక్ట్ గా గ్రీన్ సింగల్ ఇచ్చి ఉండవచ్చు అని అంటున్నారు. నాని సైతం ధీంగా ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానితో విభేదించే వారు అంతా నాని వెంట కనిపిస్తున్నారు. బుద్దా వెంకన్న వంటి వారు చిన్నితోనే తిరుగుతున్నారు.

జనసేన టీడీపీ పొత్తులు ఉంటే కనుక విజయవాడ పార్లమెంట్ పరిధిలో మార్పులు అనేక నియోజకవర్గాలలఒ చోటు చేసుకుంటాయని అంటున్నారు. దానికి తగినట్లుగా అందరినీ ఇప్పటి నుంచే కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు చిన్ని సాగుతున్నారని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే మాత్రం చిన్ని 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.