పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేసిన కేతిరెడ్డి... వీడియో వైరల్!
"ఏమిటీ కరెంట్ చార్జీలు ఇదంతా.. ఎలా పెంచుతారు.. దీనికి ఎవరు.. అంటూ ఊగుతూ ఊగుతూ మాట్లాడారు.. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు.." అంటూ పవన్ వాయిస్ ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు కేతిరెడ్డి.
By: Tupaki Desk | 27 Dec 2024 10:57 AM GMTఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి.. ప్రజలను నమ్మించి.. లబ్ధి పొంది.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం విపరీతంగా మోపుతోందని.. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరు బాట చేపట్టిన సంగతి తెలిసిందే.
ఏపీలో కూటమి (టీడీపీ, జనసేన బీజేపీ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపుతున్నారని.. ఇది చంద్రబాబు మార్కు 'బాదుడు' అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అంటున్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు విద్యుత్ చార్జీలు పెంచుతున్న సీఎం చంద్రబాబు పైనా.. ప్రశ్నిస్తానని చెప్పి మౌనాన్ని తన భాషగా చేసుకున్నట్లు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు నమ్మించి కాటేశారని మండిపడుతున్నారు. ఈ సమయంలో కేతిరెడ్డి వెటకారం వైరల్ గా మారింది.
అవును... ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపుతున్నారని ఫైరవుతూ వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కారక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ధర్మవరం నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా... ఎస్బీఐ కాలనీలోని కేతిరెడ్డి కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లాయి వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా కెతిరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు.. విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేతిరెడ్డి.. పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ వెటకారమాడారు!
ఇందులో భాగంగా... ప్రస్తుతం మనం 2:40 పైసలకు విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నామని.. దాన్ని కూడా అదానీ పేరు చెప్పి రాద్ధాంతం చేశారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా... విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పాడని, కూటమిలో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ కూడా చెప్పాడని అన్నారు.
ఈ సందర్భంగా... ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కూడా... "ఏమిటీ కరెంట్ చార్జీలు ఇదంతా.. ఎలా పెంచుతారు.. దీనికి ఎవరు.. అంటూ ఊగుతూ ఊగుతూ మాట్లాడారు.. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు.." అంటూ పవన్ వాయిస్ ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు కేతిరెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టిందని అంటున్నారు.