జగన్ 'పెదరాయుడు'లో రజనీకాంత్... షర్మిల 'వీరసింహారెడ్డి'లో వరలక్ష్మి!
స్పందించారు. ఈ సందర్భంగా జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా జగన్ ను ఏమి చేయాలనుకుంటున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు.
By: Tupaki Desk | 26 Oct 2024 6:26 AM GMTఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, విజయమ్మ, షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించినవిగా చెబుతున్న సమస్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జరుగుతున్న పరిణామాలపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల, విజయమ్మలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఆస్తుల వ్యవహరం తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ.. వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా జగన్ ను ఏమి చేయాలనుకుంటున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా... "జగన్ ని జైలుకు పంపడానికి కుట్ర చేస్తున్నారా అంటూ ప్రశ్నించిన కేతిరెడ్డి... ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈడీ అటాచ్ చేసిన అస్తులను షర్మిలకు ఎందుకు బదిలీ చేశారు? కొడుకును ఇబ్బంది పెట్టాలని కాదా?" అంటూ విజయమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదే సమయంలో... "కొడుకును ఇబ్బంది పెడుతున్నారంటే ఎవరు నాశనం అవుతున్నట్లు? వైఎస్సార్ కుటుంబమే కదా? అంతక ముందు ఎలక్షన్ కి ఒక రోజు ముందు వీడియో విడుదల చేసి.. అందరినీ నాశనం చేసి పెట్టావు! ఇప్పటికి మిగతావాళ్లు అంతా సుప్రీంకోర్టుకు వెళ్లి ఇతన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటే.. మీరేమో ఇలా చేస్తున్నారు" అంటూ ఫైర్ అయ్యారు కేతిరెడ్డి.
"ఈడీ అటాచ్ చేసిన అస్తుల విషయంలో ఈ విధంగా చేశారని చూపించి జగన్ బెయిల్ క్యాన్సిల్ చేసేది కదా..?" జగన్ ముందుగానే తేరుకోబట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకోగలిగారని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. "రజనీకాంత్ పెదరాయుడు సినిమాలో పంచినట్లు.. చెల్లెమ్మా ఇవి తీసుకో, అవి తీసుకో అంటే... ఈవిడేమో బాలకృష్ణ (వీరసింహారెడ్డి) సినిమాలో ఆవిడ (వరలక్ష్మీ శరత్ కుమార్) పొడిచినట్లు పొడిచేస్తుంది" అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో... ఈ వ్యవహారం బయటకు రావడం వల్ల జగన్ కే మంచి జరిగిందన్నట్లుగా కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతకాలం ప్రచారాలు నమ్మిన వారు నిజంగానే జగన్ తన చెల్లికి ఏమీ ఇవ్వలేదు.. వాళ్ల నాయన ఆస్తి కూడా ఇవ్వకుండా లాక్కున్నాడు అనే ప్రచారం జరిగేదని.. ఇప్పుడు వాస్తవాలు తెలిశాయని కేతిరెడ్డి తెలిపారు.