పవన్ గురించి కేతిరెడ్డి తింగరి వ్యాఖ్యానం...ఫ్యాన్స్ ట్రోల్స్ !
వారంతా కేతిరెడ్డి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 29 March 2025 4:46 PMవైసీపీ ఫైర్ బ్రాండ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక పాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ చేసిన వివాదాస్పద కామెంట్స్ మీద జనసైనికులు ఒక్కసారిగా మండిపోతున్నారు. వారంతా కేతిరెడ్డి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకీ కేతిరెడ్డి ఏమన్నారు అంటే పవన్ వంటి వారు రాజకీయాల్లో ఏమి మాట్లాడుతారో తెలియదు అని అన్నారు. నిన్న ఒకటి నేడు ఒకటి రేపు ఒకటి మాట్లాడే పవన్ రాజకీయాల్లో విశ్వసనీయ వ్యక్తి కాదని అన్నారు. ఆయన కులం గురించి పలు రకాలుగా చెబుతారు. మతం గురించి చెబుతూ బాప్టిజం తీసుకున్నాను అంటారు. మళ్ళీ ఏదేదో మాట్లాడుతారు, తన పుట్టిన ఊరు బాపట్ల అంటారు, మరో రోజు గుంటూరు చెబుతారు అని విమర్శించారు.
ఇంతకీ ఆయన ఏమి చెబుతున్నారో కూడా ఒక స్పష్టత ఏ విషయంలోనూ ఉండదని అన్నారు. ఇక చదువు విషయానికి వస్తే ఇంటర్ అంటారు, మరేదో అంటారు ఇలా మార్చుకుంటూ వెళ్తారు ఇలాంటి వారిని కూడా జనాలు అన్నీ చూసి ఎలా ఇష్టపడుతున్నారో అర్ధం కావడం లేదు అని కేతిరెడ్డి ఘాటైన వ్యాఖ్యానమే చేశారు. తన రాజకీయ జీవితంలో తాను ఇప్పటివరకూ పవన్ లాంటి రాజకీయ నేతను చూసి ఎరగను అని కూడా కేతిరెడ్డి అన్నారు ఒక సందర్భంలో పవన్ ని తింగరి అని కూడా ఆయన అన్నారని జనసైనికులు మండిపడుతున్నారు.
ఒక కులం గురించి బాహాటంగా మాట్లాడడం బహుశా పవన్ నుంచే వచ్చిందని అన్నారు. దిల్ రాజు ని జగన్ ని రెడ్లు అని మీరూ మీరూ సినీ రంగం సమస్యలను పరిష్కరించుకోవాలని అనడం ఆయనకే చెల్లు అన్నారు. అదే మాటను ట్రెడిషనల్ పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు కానీ జగన్ కానీ వేరు ఎవరూ అనడానికి కనీసంగా అయినా ఆలోచిస్తారని కేతిరెడ్డి అన్నారు.
చంద్రబాబు రెడ్ల గురించి కానీ జగన్ కమ్మల గురించి కానీ బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు ఈ తరహా గట్స్ ఉన్నది ఒక్క పవన్ కే అన్నారు ఆయన ఇంత అన్నా కూడా మరో సందర్భంలో తాను అన్న దానిని వేరేగా మార్చేసి చెప్పే సమర్థింపు కూడా ఉందని అన్నారు. దీనిని జనాలు ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
ఒక రాజకీయ నాయకుడు పెద్ద మనిషిగా ఉండాలని తాను అన్న మాటకు ప్రాణం పోయినా కట్టుబడి ఉండాలని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇలా కేతిరెడ్డి పాడ్ కాస్టర్ కార్యక్రమంలో మాట్లాడిన నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కానీ జనసైనికులు కానీ ఆయన మీద మండిపోతున్నారు.
ఇక కేతిరెడ్డిని వారు ఫుల్ గా టార్గెట్ చేస్తున్నారు. న హలో ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి స్వయంగా చేసిన ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఫుల్ గా ర్యాగింగ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంతో కేతిరెడ్డి సర్కస్ కళాకారుడిగా మారాడని, అందుకే ఆయనకు 2024 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గ ప్రజలు గుణపాఠం నేర్పించారని కూడా వారు కామెంట్స్ చేస్తున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ పవన్ పెళ్ళిళ్ళ గురించి ఆయన వైవాహిక జీవితం గురించి గతంలో కామెంట్స్ చేసేవారని ఇపుడు ఆయన పార్టీ నాయకులు ఇదే తీరున పవన్ ని విమర్శిస్తున్నారని వైసీపీకి పవన్ అంటే మంట అన్నట్లుగా జనసైనికులు అంటున్నారు.
మొత్తానికి వైసీపీ వర్సెస్ పవన్ అన్నది అలాగే కొనసాగుతోంది. దీనిని బ్రేక్ పడే సూచనలు అయితే లేవు. ఎవరో ఒకరు వైసీపీ నేత పవన్ మీద ఆడిపోసుకోవడం అలా జనసైనికుల ఆగ్రహానికి గురి కావడం జరుగుతోంది. దీని వల్ల వైసీపీ ఒక బలమైన సామాజిక వర్గానికి పవన్ ని అభిమానించే వారికీ దూరం అవుతోంది అని దానిని గమనించలేక పోతున్నారు అని అంటున్నారు పవన్ ని అంటే అది వైసీపీకే రాజకీయంగా నష్టమని తెలిసినా ఆయన ప్రస్తావన తెస్తూ ఎందుకో ఈ విధంగా చేసుకుంటున్నారని కూడా అంటున్నారు.