Begin typing your search above and press return to search.

ఎందుకు ఓడామో... ఏమో... : కేతిరెడ్డి నిర్వేదం

ఇప్పుడు అంత‌కు మించిన రేంజ్‌లో కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టంగ‌ట్టారు.

By:  Tupaki Desk   |   5 Jun 2024 11:04 AM GMT
ఎందుకు ఓడామో... ఏమో... :  కేతిరెడ్డి నిర్వేదం
X

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. 2019లో ఎలా అయితే.. ఊహించని విధంగా ప్ర‌జ‌లు తీర్పు చెప్పారో... ఇప్పుడు తాజా ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు అలాంటి అనూహ్య‌మై న తీర్పునే చెప్పారు. అప్ప‌ట్లో వైసీపికి ఏకప‌క్షంగా 151 సీట్లు అప్ప‌గించారు. ఇప్పుడు అంత‌కు మించిన రేంజ్‌లో కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టంగ‌ట్టారు. ఏకంగా 168 స్థానాల్లో వీటిని గెలిపించారు.

ఇక‌, ఎంతో ఆశ‌లు పెట్టుకుని.. సంక్షేమం, మ‌హిళ‌లు, రైతులు త‌మ‌ను గెలిపిస్తార‌ని భావించిన వైసీపికి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. కేవ‌లం 11 స్థానాల్లో మాత్ర‌మే ఆ పార్టీని గెలిపించారు. ఇది ఎవ‌రూ ఊహిం చ‌ని ప‌రిణామం. క‌నీసం క‌ల‌లో కూడా ఎవరూ భావించ‌ని ప‌రిణామం. దీంతో వైసీపీ నాయ‌కులు షాక్‌లో ఉన్నారు. అంతేకాదు. అస‌లు ఇలాంటి ప‌రిణామంపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కావ‌డం లేదు. దీంతో వైసీపీ త‌ర‌ఫున ఓడిపోయిన నాయ‌కులు.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

మంగ‌ళ‌వారం వ‌చ్చిన ఫ‌లితాల త‌ర్వాత‌.. దాదాపు వైసీపీ నాయ‌కులు అంద‌రూ కూడా.. సైలెంట్ అయిపో యారు..ఎవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. అయితే.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఒక్కొక్క‌రుగా మీడియా ముం దుకు వ‌స్తున్నారు. వీరిలో ధ‌ర్మ‌వ‌రం నుంచి ఓడిపోయిన కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. తాను ఏ కార‌ణంతో ఓడిపోయానో .. త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌న్నారు. అంతేకాదు.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి నాన్ లోక‌ల్ అయిన‌.. స‌త్య‌కుమార్‌ను ఎలా గెలిపించారో కూడా త‌న‌కు అంతుచిక్క‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

ఈ ఫ‌లితాలు చూస్తుంటే బాధ క‌లుగుతోంద‌ని, నిజాయితీగా ఉంటే సరిపోద‌ని.. అబ‌ద్ధాలు చెప్పి ఉంటే బాగుండేద‌ని.. కానీ, తాను ఆ పని చేయ‌లేక‌పోయాన‌ని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను దుర‌దృష్ఖ‌క‌ర‌మ‌ని చెప్పారు. ఇక‌, రాజానగ‌రం నుంచి ఓడిపోయిన‌... జ‌క్కం పూడి రాజా కూడా.. బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. త‌న నిజాయితీ..త‌న‌ను ఓడించింద‌నిఅన్నారు.. తాము నిజాయితీగా ఉండి సేవ‌లు చేసి.. త‌ప్పుచేశామ‌ని.. వ్యాఖ్యానించారు. ఈ ఫ‌లితాలను తాము ఊహించ‌లేద‌న్నారు.