Begin typing your search above and press return to search.

టార్గెట్ వైసీపీ కేతిరెడ్డి...గెస్ట్ హౌస్ స్టోరీ ఏంటి ?

సుమారుగా రెండున్నర ఎకరాలలో ఉన్న ఈ గెస్ట్ హౌస్ భూమి అసైండ్ ల్యాండ్ అని దీనిని కుటుంబ సభ్యుల పేర్లతో మాజీ ఎమ్మెల్యే రిజిష్టర్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 April 2025 2:30 PM
టార్గెట్ వైసీపీ కేతిరెడ్డి...గెస్ట్ హౌస్ స్టోరీ ఏంటి ?
X

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో గెలిచారు. వైసీపీలో గెలిచారు 2024లో ఓటమి పాలు అయ్యారు. కచ్చితంగా గెలిచే సీటు అది అని వైసీపీతో పాటు ఆయనకు అంచనాలు ఉన్నాయి. అయితే జస్ట్ పది రోజులలో ఆయనను మాజీ ఎమ్మెల్యే చేశారు బీజేపీకి చెందిన సత్య కుమార్ యాదవ్.

పొత్తులో భాగంగా ఆయనకు ధర్మవరం సీటు ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అయిదేళ్ళ పాటు జనంతో ఫుల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న కేతిరెడ్డి అయితే తనకు ఈ పొత్తు మరింత ఈజీ అనుకున్నారు. ధర్మవరం సీటు ఆశించిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కానీ అలాగే పరిటాల వారసుడు శ్రీరాం కానీ సహకరించరు వర్గ పోరుతో ఇంకా మెజారిటీ వస్తుందని చూస్తే సత్య కుమార్ యాదవ్ మంచి విజయం సాధించడమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు.

దాంతో గడచిన పది నెలలుగా రాజకీయ వైరాగ్యంలోనే కేతిరెడ్డి ఉన్నారని చెబుతారు. ఆయన ఒక దశలో సొంత పార్టీ తప్పులను అధినాయకత్వం చేసిన మిస్టేక్స్ ని కూడా ఎండగట్టి మరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అదే సమయంలో కూటమి మీద విమర్శలు చేశారు. ఈ మధ్యనే ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ మీద హాట్ కామెంట్స్ చేసి జనసేనకు కన్నెర్ర అయ్యారు.

ఇదిలా ఉంటే ఓటమి తరువాత ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఆయన గడుపుతున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో బలమైన నేతగా ఉన్న కేతిరెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అని అంటున్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు కేతిరెడ్డి ధర్మవరంలోని గుర్రాల కొండ మీద అన్ని సదుపాయాలతో కూడిన ఒక గెస్ట్ హౌస్ ని నిర్మించుకున్నారు. అయితే ఈ గెస్ట్ హౌస్ భూమి ప్రభుత్వానికి చెందినదిగా ఇపుడు అధికారులు గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు కేతిరెడ్డి ఈ గెస్ట్ హౌస్ నిర్మించారు అప్పట్లోనే ఇది ప్రభుత్వ స్థలం అన్న ఆరోపణలు టీడీపీ చేసింది. కానీ పట్టించుకోలేదు.

ఇపుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. సుమారుగా రెండున్నర ఎకరాలలో ఉన్న ఈ గెస్ట్ హౌస్ భూమి అసైండ్ ల్యాండ్ అని దీనిని కుటుంబ సభ్యుల పేర్లతో మాజీ ఎమ్మెల్యే రిజిష్టర్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు అని అంటున్నారు. ఇక ఈ గెస్ట్ హౌస్ ని భూమిని స్వాధీనం చేసుకోవడానికి లేటెస్ట్ గా రెవిన్యూ అధికారులు వెళ్ళారు అని చెబుతున్నారు.

అయితే గుర్రాల కొండకు వెళ్ళే మార్గంలో గేటు వేసి ఉండడాన్ని వారు గుర్తించారు. దాంతో అధికారులు వెనుతిరిగారు. అయితే అధికారులు మరోసారి వెళ్ళి అయినా ఈ గెస్ట్ హౌస్ ని సీజ్ చేస్తారు అని అంటున్నారు. అలా చేయాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. టీడీపీ కేతిరెడ్డి మీద టార్గెట్ చేసింది దాంతో కేతిరెడ్డి ఇపుడు ఏ విధంగా తన కలల మందిరాన్ని కాపాడుకుంటారు అన్నది చర్చగా ఉంది. మొత్తానికి వైసీపీ ఫైర్ బ్రాండ్ కి కొత్త చిక్కులు వస్తున్నాయని అంటున్నారు.