అదానీ – జగన్ వ్యవహారంలో కీలక పరిణామం!
అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలు, అభియోగాలపై ఎవరి స్థాయిలో వారి వారి భావానువాదాలతో ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
By: Tupaki Desk | 26 Nov 2024 10:54 AM GMTగత ప్రభుత్వ హయాంలో జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలు, అభియోగాలపై ఎవరి స్థాయిలో వారి వారి భావానువాదాలతో ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
అయితే... తాము ఒప్పందం చేసుకున్నది 'సెకీ'తో అని.. పైగా గతంలో చంద్రబాబు సర్కార్ కొనుగోలు చేసిన ధరకంటే తక్కువకే కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని.. సగం సగం తెలుసుకుని హాఫ్ నాలెడ్జ్ ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి మేలు జరిగిందని చెబుతున్నారు.
మరోపక్క దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. మరోపక్క అదానీపై ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆయనతో అంటకాగకుండా.. వెంటనే అదానీ సంస్థలను ఏపీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
ఇక.. ఈ వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదంటూ గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన, ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. అదంతా అసత్యమని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు! ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలక పరిణాం చోటు చేసుకోంది.
అవును... అదానీ - జగన్.. సెకీతో విద్యుత్ ఒప్పందం - రూ.1,750 కోట్ల లంచం అనే వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి అనే వ్యక్తి తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.!
జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్న నల్లమోతు చక్రవర్తి ... సెకీతో అదానీ కంపెనీ ఒప్పందపైనా విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు!
మరోపక్క ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలని.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని.. వీలైనంత తొందర్లో ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చెప్పాలని.. అలాకానిపక్షంలో కాంగ్రెస్ చేస్తొన్న "మోదానీ" ఆరోపణలు నిజమని నమ్మే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు!