Begin typing your search above and press return to search.

జమిలిపై కోవింద్ కమిటీ రిపోర్టులో 10 కీలకాంశాలు ఇవే

తాజాగా ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయటమే కాదు.. రానున్న శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లుగా మోడీ సర్కారు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 7:30 AM GMT
జమిలిపై కోవింద్ కమిటీ రిపోర్టులో 10 కీలకాంశాలు ఇవే
X

ఒక దేశం.. ఒకే ఎన్నికల నినాదంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికల ప్రక్రియకు తెర తీసింది బీజేపీ. కొన్నేళ్లుగా ఈ అంశంపై కసరత్తు చేస్తున్న బీజేపీ.. తాజాగా జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేత్రత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయటమే కాదు.. రానున్న శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లుగా మోడీ సర్కారు వెల్లడించింది.

జమిలి ఎన్నికలపై నివేదికను రాష్ట్రపతికి అందజేశారు. బుధవారం దానిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కొవింద్ కమిటీ రిపోర్టుల ఏమని పేర్కొంది. కీలకమైన సలహాలు.. సూచనలు ఏం చేసింది? లాంటి అంశాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏళ్లకు ఏళ్లుగా చర్చల్లో నలుగుతున్న జమిలి ఎన్నికలకు సంబంధించి కొత్త అడుగులు షురూ అయ్యిందని చెప్పాలి. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ చేసిన టాప్ 10 కీలక సూచనల విషయానికి వస్తే..

- జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి.

- మొదటి దశలో లోక్ సభ.. అసెంబ్లీలకు ఎన్నికలకు నిర్వహించాలి

- రెండో దశలో కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలకు.. గ్రామ పంచాయితీలకు ఎన్నికల్ని నిర్వహించాలి. ఈ మొత్తం ప్రక్రియ మొత్తం 100 రోజుల్లో పూర్తి కావాలి. లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లో వీటిని నిర్వహించాలి.

- ఏకకాల ఎన్నికలకు లోక్ సభ తొలిసారి సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి.

- అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీ కాలాన్ని గుర్తించాలి.

- హంగ్ సభలు ఏర్పాటు అయినప్పుడు కానీ.. అవిశ్వాస తీర్మానాల వేళలో లోక్ సభకు తాజా ఎన్నికలను నిర్వహించాలి.

- లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. ఐదేళ్లలో మిగిలిపోయిన కాలానికే ఆ సభ కొనసాగేలా చూడాలి.

- ఒకవేళ అసెంబ్లీలు రద్దు అయినప్పటికీ.. లోక్ సభా పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికే అవి కంటిన్యూ కావాల్సిందే

- రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి.

- ఎన్నికల సామాగ్రి.. ఈవీఎంలు.. వీవీ ప్యాట్లు.. పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవటంపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.