Begin typing your search above and press return to search.

భారత్ - చైనా ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై కీలక అప్ డేట్!

ఈ సందర్భంగా.. మోడీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ నేపథయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తోనూ ప్రధాని మోడీ భేటీ కానున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 3:54 AM GMT
భారత్ - చైనా ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై  కీలక అప్  డేట్!
X

రష్యాలోని కజాన్ లో జరుగుతున్న 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇదురు దేశాల దౌత్య బంధంతో పాటు ప్రధానంగా రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉన్న వివాదం విషయం కూడా ఈ చర్చల్లో ప్రస్థావనకు వచ్చిందని అంటున్నారు.

ఈ సందర్భంగా పుతిన్ కు మోడీ భారత వైఖరిని తెలియజేస్తూ ఓ సలహానూ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... వివాదాలకు శాంతియుత పరిష్కారాలను భారత్ విశ్వసిస్తుందని.. చర్చలతో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయనేది తమ వైఖరి అని మోడీ అన్నారు. ఈ విషయంలో అవసరమైన సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.

అంతకు ముందు ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ కజాన్ చేరుకున్న సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా.. మోడీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ నేపథయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తోనూ ప్రధాని మోడీ భేటీ కానున్నారని తెలుస్తోంది. దీంతో.. ఇది ఆసక్తికరంగా మారింది.

అవును... రష్యాలోని కజాన్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భారత ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. సుమారు ఐదేళ్ల తర్వత ఇద్దరి నేతల మధ్య లాంఛనంగా జరగనున్న భేటీ కావడంతో దీనిపై ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ ఆసక్తి నెలకొంది.

2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకి సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇరుదేశాధినేతల మధ్య తాజాగా భేటీ జరగనుండటం ఆసక్తిగా మారింది. ఈ భేటీకి సంబంధించిన విషయాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ విస్రీ ధృవీకరించారు.

కాగా... 2019 అక్టోబర్ లో చివరిసారిగా మహాబలిపురంలో ప్రధాని మోడీ, జీ జిన్ పింగ్ మధ్య అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత మే 2020 నుంచి ఇరు దేశాల మిలటరీ ప్రతిష్టంభనల నేపథ్యంలో... మోడీ – జిన్ పింగ్ భేటీ ఎలాంటి ఫలితాలను అందించబోతోందనేది ఆసక్తిగా మారింది.