Begin typing your search above and press return to search.

బీజేపీలో కీలక నిర్ణయాలు

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నియమించింది.మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లకు ఇంచార్జీల నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 1:17 PM GMT
బీజేపీలో కీలక నిర్ణయాలు
X

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీలో కీలక నిర్ణయాలు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా వివిధ రాష్ట్రాలకు ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్ లతో పాటు కో-ఇన్‌చార్జిలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నియమించింది.మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లకు ఇంచార్జీల నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

మహారాష్ట్ర ఎన్నికల ఇంచార్జిగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కే ఇంఛార్జ్ గా అశ్వని వైష్ణవ్, హర్యానా ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో-ఇంఛార్జిగా బిప్లబ్ కుమార్ దేబ్, జార్ఖండ్ ఇంఛార్జ్ గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో-ఇన్‌చార్జ్‌గా అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ, జమ్మూ కాశ్మీర్ ఇన్‌ఛార్జ్ గా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలను నియమించింది.

దీంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లను త్వరలోనే మార్చనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ గవర్నర్ గా కేంద్ర పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి అశ్వని కుమార్ చౌబే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కర్ణాటక గవర్నర్ పంపే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లాను మరోసారి ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజు నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సంప్రదించగా ఆయన మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది.