Begin typing your search above and press return to search.

రాస‌లీల‌ల్లో టీడీపీ నేత‌.. వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు!

ఇప్పుడు ఇదే కోవ‌లో టీడీపీ నాయ‌కుడు కూడా తెర‌మీదికి వ‌చ్చాడు. ప్రలోభాలతో మహిళల్ని లొంగదీసుకొంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Oct 2024 4:12 PM GMT
రాస‌లీల‌ల్లో టీడీపీ నేత‌.. వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు!
X

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి చెందిన పార్టీల నేత‌లు రెచ్చిపోతున్నారు. డ‌బ్బుల వ‌సూళ్లు, దందాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. వారి రాస‌లీల‌లు రోజుకొక విధంగా తెర‌మీదికి వ‌స్తున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు బీజేపీ కీల‌క‌నాయ‌కుల వ్య‌వ‌హారం వెలుగు చూసింది. అయితే.. ఈ విష‌యాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా దాచేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా.. వారి విష‌యాలు సోష‌ల్ మీడియాలో వెలుగు చూశాయి. దీంతో ర‌చ్చ‌యింది. అనంత‌రం.. వారిని పార్టీ నుంచిస‌స్పెండ్ చేశారు.

ఇక‌, ఇప్పుడు ఇదే కోవ‌లో టీడీపీ నాయ‌కుడు కూడా తెర‌మీదికి వ‌చ్చాడు. ప్రలోభాలతో మహిళల్ని లొంగదీసుకొంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా చానాళ్లుగా పార్టీలో ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పానికి ప‌రిశీల‌కుడిగా కూడా ప‌నిచేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం కూడా చేశాడు.

అయితే.. తాజాగా ఆయ‌న రాస‌లీలల వీడియోలో చిక్కుకున్నారు. రాయ‌చోటి ఎమ్మెల్యే, క‌మ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఖాదర్ బాషా.. మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానని మ‌హిళ‌ల‌ను ప్రలోభ పెట్టి లొంగతీసుకుంటున్నట్లు ఓ మ‌హిళ ఉర్దూ భాష‌లో సెల్ఫీ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టింది. దీనికి.. ఖ‌దీర్ బాషాతో ఓ మ‌హిళ ఉన్న వీడియోను కూడా జ‌త చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియో ప్ర‌స్తుతం ఏపీలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. మ‌రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నెల రోజుల కింద‌ట‌.. సెప్టెంబ‌రులో తిరుప‌తి జిల్లాకు చెందిన స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కూడా ఇలానే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టీడీపీకి చెందిన నాయ‌కురాలు ఒక‌రు.. ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. త‌ర్వాత ఈ కేసు మాఫీ అయింది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.