Begin typing your search above and press return to search.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పై దాడికి యత్నం.. వీడియో

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై లండన్‌లో ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి చేయడానికి యత్నించడం కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   6 March 2025 9:52 AM IST
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పై దాడికి యత్నం.. వీడియో
X

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై లండన్‌లో ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి చేయడానికి యత్నించడం కలకలం రేపింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జైశంకర్ కారుకు సమీపంగా ఖలిస్థానీ మద్దతుదారులు ఆకస్మికంగా చేరుకొని, దాడి ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ భద్రతా సిబ్బంది తక్షణ చర్యలతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

ఈ ఘటనలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత జాతీయ జెండాను అవమానించే ప్రయత్నం చేశారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన భద్రతా లోపాన్ని సూచిస్తున్నప్పటికీ అధికారిక సమాచారం కోసం భారత విదేశాంగ శాఖ నుండి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో ఖలిస్థానీ మద్దతుదారులు లండన్‌లో భారత హైకమిషన్ కార్యాలయంపై దాడి చేసి, జాతీయ జెండాను అవమానపరిచిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అలాంటి సందర్భాల్లో, భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడంలో బ్రిటన్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో లండన్‌లో భద్రతా చర్యలను మరింత బలపరచాలని, భారత అధికారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌పై దాడి ప్రయత్నం వంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారత్ నొక్కి చెబుతోంది.