Begin typing your search above and press return to search.

అన్నను పికప్ చేసుకోవటానికి వెళ్లి హత్యకు గురైన ఖమ్మం కుర్రాడు

మరోవైపు సదరు కుర్రాడి కుటుంబ సభ్యులు.. బంధువులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. నిందితుల్ని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:16 AM GMT
అన్నను పికప్ చేసుకోవటానికి వెళ్లి హత్యకు గురైన ఖమ్మం కుర్రాడు
X

సంక్రాంతి పండుగ వేళ.. ఇంటికి వస్తున్న అన్నయ్యను పికప్ చేసుకోవటానికి వెళ్లిన ఖమ్మం కుర్రాడు హత్యకు గురైన వైనం కొత్తకలకలంగా మారింది. అసలేం జరిగింది? హత్య ఎందుకు జరిగింది? హత్యకు ముందు.. అన్న ఫోన్ కు తమ్ముడు పెట్టిన వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నట్లుగా.. సమస్యలో చిక్కుకున్న అమ్మాయి ఎవరు? ఆమె ఆచూకీ ఏది? లాంటి ప్రశ్నలు బోలెడు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. మొత్తం వ్యవహారం మిస్టరీగా మారింది. అంతేకాదు.. హత్యకు గురైన కుర్రాడికి సంబంధించి ఎలాంటి క్లూ పోలీసులకు చిక్కలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు సదరు కుర్రాడి కుటుంబ సభ్యులు.. బంధువులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. నిందితుల్ని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మిస్టరీగా మారిన ఈ మర్డర్ వ్యవహరంలోకి వెళితే. పండుగ సందర్భంగా అన్న జ్ఞానసాయి ఊరికి వస్తున్న వేళ.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పరిధిలోని హనుమంతరావు.. మమతల చిన్న కొడుకు ఖమ్మం బస్టాండ్ కు వెళ్లాడు. వీరి పెద్ద కొడుకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కంపెనీలు జాబ్ చేస్తున్నాడు. చిన్న కొడుకు అజయ్ కుమార్ (22) అన్న దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక్కడే ముందుగా ఇంటికి వచ్చేశాడు.

సోమవారం తెల్లవారుజామున అన్న బస్సులో ఖమ్మంకు వస్తుండటంతో అతడ్ని పికప్ చేసుకోవటానికి ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరాడు. బస్టాండ్ కు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరి వెళ్లిన అతను.. కాసేపటికి తండ్రికి ఫోన్ చేసి.. తనను ఆటో ఢీకొన్నట్లుగా చెప్పాడు. కాసేపటికి సాగర్ కాల్వకట్టపై ఆటోలో ఒక యువతిని చంపారని.. తనను కూడా చంపుతున్నట్లుగా తన అన్నకు వాయిస్ మెసేజ్ పోస్టు చేశాడు.

ఆ తర్వాత ఫోన్ పని చేయలేదు. దీంతో.. కుటుంబ సభ్యులు..కాలనీ వాసులు సాగర్ కాలువ కట్టపైకి వెళ్లి గాలించగా.. అజయ్ కుమార్ బైకు దొరికింది. కానీ.. అతడు మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేయగా.. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరకు అతడి డెడ్ బాడీని తనికెళ్ల పరిధిలోని సాగర్ కాల్వ వద్ద లభించింది. అయితే.. తన కొడుకును హత్య చేసిన నిందితుల్ని అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫోన్ కు పంపిన వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నట్లుగా యువతి మిస్సింగ్ కానీ.. మర్డర్ కానీ అయినట్లుగా ఇప్పటివరకు ఆధారాలు లభించకపోవటంతో.. ఈ ఇష్యూ ఇప్పుడో మిస్టరీగా మారింది. దీన్ని తేల్చేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.