Begin typing your search above and press return to search.

కేసీయార్ ను ఖమ్మం ఇబ్బందిపెడుతోందా ?

బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పొంగులేటి పావులు కదుపుతున్నారు

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:31 PM GMT
కేసీయార్ ను ఖమ్మం ఇబ్బందిపెడుతోందా ?
X

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ తో సంబంధాలు తెగిపోయి చాలాకాలమే అయ్యింది. అయితే పొంగులేటి అంటే కేసీయార్లో భయం పోయినట్లు లేదు. అందుకనే జిల్లాలో మాజీఎంపీ మద్దతుదారులుగా ముద్రపడిన వారికి పదేపదే ఫోన్లు చేయిస్తున్నారు.

కొందరిని బుజ్జగిస్తున్నారు. ఎవరెవరి అవసరాలు ఏమిటో తెలుసుకుంటున్నారు. అవకాశం ఉన్నంతలో మద్దతుదారులందరినీ కాంగ్రెస్ లో నుండి బయటకు తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలన్నది కేసీయార్ ఆలోచన.

ఇందులో భాగంగా భద్రాచలంకు చెందిన పొంగులేటి మద్దతుదారులు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లును కాంగ్రెస్ లో నుండి బయటకు లాగేశారు. ఇద్దరినీ బీఆర్ఎస్ లో చేర్చుకోబోతున్నారు. ఎవరికి అవసరమైన వారికి అంటే కాంట్రాక్టులు, పదవులు, ప్రోటోకాల్ ఏవి కావాలంటే అవి ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత పొంగులేటి దెబ్బ కేసీయార్ మీద ఎంతబలంగా పడిందో అర్ధమవుతోంది.

బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పొంగులేటి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ జలగం వెంకట్రావు లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచర, మద్దతుదారులున్న పొంగులేటిని దెబ్బకొట్టడం అంత తేలికకాదు. అయితే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడం పొంగులేటికి పెద్ద కష్టమూ కాదు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మొదటినుండి బీఆర్ఎస్ కు పెద్దగా బలంలేదు.

అందుకనే కేసీయార్ కూడా జిల్లాపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే జిల్లాలో మెజారిటి సీట్లు గెలవాలని కేసీయార్ టార్గెట్ పెట్టుకున్నారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ ను దారుణంగా దెబ్బతీయాలని పొంగులేటి కూడా కంకణం కట్టుకున్నారు. అందుకనే జిల్లా అంతా తిరుగుతు బీఆర్ఎస్ వ్యతరేకులందరినీ చేరదీస్తున్నారు. ఇది గమనించిన కేసీయార్ వెంటనే అలర్టయి పొంగులేటి మద్దతుదారుల్లోనే చీలిక తేవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇద్దరిని లాక్కోవటం ద్వారా కొంత సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. మొత్తానికి రాబోయే ఎన్నికలు ఇటు కేసీయార్ అటు పొంగులేటి వ్యక్తిగత సామర్ధ్యానికి పెద్ద పరీక్ష పెట్టబోతున్నట్లు అర్ధమవుతోంది.