యూఎస్ లో ఖమ్మం విద్యార్థి మృతి... తెరపైకి ఊహించని విషయాలు!
ఎన్నో ఆశలు, ఆశయాలు.. ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు ఊహించుకుని విదేశాలకు వెళ్తుంటారు భారతీయ విద్యార్థులు
By: Tupaki Desk | 1 July 2024 5:46 AM GMTఎన్నో ఆశలు, ఆశయాలు.. ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు ఊహించుకుని విదేశాలకు వెళ్తుంటారు భారతీయ విద్యార్థులు. అయితే వారి కలలు, తల్లితండ్రుల ఆశలు ఒక్క సంఘటనతో ఆవిరైపోతుంటాయి. అలాంటి ప్రమాదాలు ఇటీవల కాలంలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. విదేశాల్లో ప్రమాదాల భారిన పడిన ఎంతోమంది విద్యార్థులు మృతిచెందుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల నిమిత్తమో విదేశాలకు వెళ్లిన చాలా మంది యువత ఇటీవల కాలంలో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. మృత్యువు పలు రూపాల్లో కాటు వేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలోని మిస్సోరిలో మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
అవును... తాజాగా అమెరికాలోని మిస్సోరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఖమ్మం జిల్లా చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అదే అతడు చేసిన నేరమైపోయింది.. పాపమైపోయింది!
ఇక కిరణ్ తండ్రి చనిపోగా.. తల్లి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది. అతని తాత సృష్ణమూర్తి.. కిరణ్ బాధ్యతలు చూసుకుంటూ... అతడి చదువు, యూఎస్ ప్రయాణానికి సంబంధించి మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కిరణ్ అకాల మరణవార్త ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అతడి మృతదేహం గురువారం స్వగ్రామానికి రానుందని తెలుస్తుంది.