వయనాడ్ లో ప్రియాంకగాంధీపై పోటీ... ఖుష్బూ ఇంట్రస్టింగ్ రియాక్షన్!
అదే వయనాడ్ లోక్ సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోపక్క ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీపై ఖుష్బూ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 18 Oct 2024 4:50 PM GMTఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత ఇటీవల హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ గెలవగా.. జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది! ఈ నేపథ్యంలో నవంబర్ లో ఓ ఆసక్తికర ఉప ఎన్నిక జరగబోతోంది.
అదే వయనాడ్ లోక్ సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోపక్క ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీపై ఖుష్బూ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీనిపై తాజాగా స్పందించిన నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఆసక్తికరంగా స్పందించారు.
అవును... కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గంతో పాటు, కేరళ లోని వయనాడ్ నియోజకవర్గంలోనూ విజయం సాధించారు. అనంతరం.. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో... ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు చేయూతనిచ్చిన వాయనాడ్ ప్రజలను వదలకుండా ఉండేందుకు ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలోనే ప్రియాంకకు పోటీగా ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీపై పోటీకి బీజేపీ ఖుష్బూను బరిలోకి దింపనుందని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారంపై ఖుష్బూ స్పందించారు. ఇందులో భాగంగా... ఎన్నికల సమయాల్లో ఇలాంటి పుకార్లు సహజమని.. ఇప్పుడు కూడా అదే పద్దతి నడుస్తోందని.. ఇందులో వాస్తవం లేదని తెలిపారు!
ఇదే సమయంలో... వయనాడ్ లో పోటీపై పార్టీ అధిష్టాణం తనతో ఇంకా మాట్లాడలేదని కూడా ఖుష్బూ చెప్పారు. అయితే... ఈ పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. దీంతో... ప్రియాంక గాంధీపై ఖుష్భూ పోటీ అనే ప్రచారం ఇంకా ప్రచారంగానే ఉంది!