ఇంత దిగజారుతారని అనుకోలేదు.. ఖుష్బూ ఇచ్చి పడేసిందిగా..!
తమిళ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తమిళ మీడియా సంస్థ మీద ఫైర్ అయ్యారు.
By: Tupaki Desk | 30 Dec 2024 2:30 PM GMTతమిళ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తమిళ మీడియా సంస్థ మీద ఫైర్ అయ్యారు. తన అనుమతి లేకుండా తాను మాట్లాడిన మాటలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడం అసలేమాత్రం బాగోలేదు అన్నారు. మరి ఇంత దిగజారుతారని తాను అనుకోలేదని అనుమతి లేకుండా వాయిస్ ని ఎలా రికార్డ్ చేస్తారు అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే ప్రముఖ మీడియా సంస్థ తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి పై ఖుష్బూ స్పందన అడిగారు.
ఫోన్ కాల్ తో ఆమెను సంప్రదించిన మీడియా సంస్థ.. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ఏంటని అడగ్గా.. ఖుష్బూ స్పందిస్తూ ఆ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. వాటికి తనను ఆహ్వానించలేదని అన్నారు. ఒకవేళ ఇచ్చినా అది చివరి నిమిషంలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని తమిళనాడు బీజేపీ తనను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. ఐతే ఖుష్బూ మాట్లాడిన వాటిని రికార్డు చేసి ఆ మీడియా సంస్థ ఎక్స్ లో షేర్ చేసింది.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖుష్బూ ఇంత దిగజారుతారని అనుకోలేదని ఖుష్బూ ఎక్స్ లో రాసుకొచ్చారు. తాను మాట్లాడిన మాటలు నిజమే కానీ ఇలా తనకు తెలియకుండా రికార్డ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఐతే మీడియా సంస్థ మాత్రం అది ఖుష్బూ పర్మిషన్ తోనే రికార్డ్ చేశామని అంటున్నారు. దీనిపై ఖుష్భూ కూడా వాళ్లు చెప్పేదంతా నిజం కాదని ఫోన్ రికార్డ్ చేస్తున్నామని చెప్పలేదని అంటున్నారు.
ఏ విషయాన్నైనా స్ట్రైట్ గా పాయింట్ చెప్పే ఖుష్భూ లేటెస్ట్ గా మీడియా సంస్థ మీద అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోవట్లేదని ఐతే తాను పార్టీ వీడుతున్నా అని వార్తలు రాస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదని అన్నారు ఖుష్బూ. ప్రధాని మోడీ విజన్, ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంకా శ్రమిస్తా అని ఆమె అన్నారు. ఖుష్బూ వర్సెస్ మీడియా సంస్థ ఎక్స్ వేదికగా ఫైట్ జరిగింది. ఐతే ఈ విషయాన్ని ఖుష్బూ సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఐతే ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హా**ట్ టాపిక్ గా మారింది.