Begin typing your search above and press return to search.

ఊరంతా కిడ్నీలు అమ్ముకున్నారు... మళ్లీ పెరుగుతుందనంట!

అప్పుడప్పుడూ కిడ్నీ ర్యాకెట్ అంటూ కొన్ని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.

By:  Tupaki Desk   |   3 April 2024 9:30 AM GMT
ఊరంతా కిడ్నీలు అమ్ముకున్నారు... మళ్లీ  పెరుగుతుందనంట!
X

అప్పుడప్పుడూ కిడ్నీ ర్యాకెట్ అంటూ కొన్ని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని ఆస్పత్రులు, కొందరు వైద్యులు, మరికొంతమంది బ్రోకర్ లు కలిసి అమాయక ప్రజలకు డబ్బు ఆశచూపించి, మాయ మాటలు చెప్పి కిడ్నీలు తీసుకుని అమ్ముకుంటున్నారనేది ఆవార్తల సారాంశంగా ఉంటుంటుంది. అయితే... ఇలాంటి మాయలో పడటంతో... ఊరు ఊరంతా సింగిల్ కిడ్నీ తో మిగిలిపోయారు! ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

అవును... కొందరు మాయమాటలు చెప్పి ఒక గ్రామంలోని మగాళ్లందరినీ సింగిల్ కిడ్నీ వాళ్లను చేశారని తెలుస్తుంది. దీనికి పేదరికం ఒక కారణం కాగా... ఆపరేషన్ అనంతరం కిడ్నీ తిరిగి పెరుగుతుందని మాయగాళ్లు చెప్పిన మాటలను ఈ గ్రామస్థులు నమ్మటం మరోకారణం అని చెబుతున్నారంట. దీంతో బ్రోకర్ల మాయ మాటలను నమ్మారంట ఈ గ్రామ ప్రజానికం! ఫలితంగా... ఈ గ్రామాన్ని ఏకంగా కిడ్నీ వ్యాలీ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... నేపాల్ లోని హోక్సే గ్రామంలో దాదాపు ప్రతీ ఇంటి నుంచీ ఒక్కరైనా కిడ్నీని విక్రయించినవారే ఉంటారంట. అందుకే ఈ గ్రామాన్ని కిడ్నీ వ్యాలీ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. కొంతమంది బ్రోకర్లు ఈ ప్రాంతాన్ని రెగ్యులర్ గా సందర్శిస్తూ.. ఇది చట్టవిరుద్ధం అయినప్పటికీ.. ఒక్క అవయువంతో బ్రతకడానికి ప్రజలను ఒప్పిస్తారని తెలుస్తుంది. దీంతో.. కిడ్నీ కోల్పోయాక కానీ తాము మోసపోయామన్న విషయం వీరికి అర్ధం కాదంట!

ఈ విషయాలపై స్పందించిన గ్రామస్థులు కొందరు.. తాము దోపిడీకి గురయ్యామని, మోసపోయామని, తమ మూత్రపిండాలు తిరిగి పెరుగుతాయని చెప్పడంతో వాటిని అమ్ముకున్నామని చెబుతున్నారంట. దీంతో... నేపాల్ లోని పేదరికం మరో ఆరోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తోందని అంటున్నారు.

ముందుగా డబ్బులు అవసరమైన వారు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు.. ఏజెంట్లు ఖాట్మండులో భారతీయ ఐడీ కార్డులతో సహా నకిలీ పత్రాలను తయారు చేస్తారంట. ఈ విషయాలపై స్పందించిన బాధితులు... తమను ఇండియాలో ఉన్న పేషెంట్ బందువులుగా, రక్త సంబంధీకులుగా చూపించే విధంగా ఐడీలు క్రియేట్ చేస్తారని.. తాము కిడ్నీలు అమ్ముతున్నట్లు అక్కడ వైద్యులకు కూడా తెలుసని చెబుతున్నారని తెలుస్తుంది!

అయితే... ఈ సమస్య కేవలం నేపాల్ లోనే కాదని.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అవయువ మార్పిడి ఆపరేషన్స్ లో 10 ఇంటిలో ఒకటి ఇలా అక్రమంగా తీసుకున్నదే అని ఘణాంకాలు చెబ్బుతున్నాయని అంటున్నారు! ఇక ఈ హోక్సే గ్రామం విషయనికొస్తే... ఇక్కడ ఊరిలో మెజారిటీ ప్రజలు ఒక్క కిడ్నీతోనే ఉన్నారంట!