Begin typing your search above and press return to search.

మ‌నోడే.. కానీ, మోడీ గూటికి చేరాక మాట మారింది!

కానీ, ఇప్పుడు అదే పౌర విమాన‌యాన శాఖ‌ను రామ్మోహ‌న్‌నాయుడికి ప్ర‌ధాని మోడీ కేటాయించారు. అయితే.. ఆయ‌న ఈ ప‌ద‌వి చేప‌ట్టిన వెంట‌నే అనేక స‌మ‌స్య‌లు ఎదురొచ్చాయి.

By:  Tupaki Desk   |   25 July 2024 11:29 AM GMT
మ‌నోడే.. కానీ, మోడీ గూటికి చేరాక మాట మారింది!
X

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఏపీకి చెందిన నాయ‌కుడే. టీడీపీ త‌ర‌ఫున శ్రీకాకుళం నుంచి ఎన్నికైన ఎంపీనే. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న మోడీ కేబినెట్లో మంత్రి. దీంతో గ‌తానికి ఇప్ప‌టికీ ఆయ‌న‌లో చ‌క్క‌ని తేడాస్ప‌ష్టంగా క‌నిపించింది. అప్ప‌ట్లో విమానాల చార్జీల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌.. టీఎంసీ నాయ‌కురాలితో త‌న గ‌ళాన్ని జ‌త‌క‌లిపిన‌.. రామ్మోహ‌న్ నాయ‌కుడు.. ఇప్పుడు కూడా అదేస‌మ‌స్య ఎదుర్కొన్నారు. అయితే.. అప్ప‌ట్లో ధ‌ర‌లు ఎందుకు నియంత్రించ‌లేర‌న్న టీఎంసీ ఎంపీకి మ‌ద్ద‌తుగా.. ``ఔను ఎందుకు?`` అని ముక్త‌స‌రిగా ప్ర‌శ్నించారు. (గ‌త ఐదేళ్ల ముచ్చ‌ట‌)

కానీ, ఇప్పుడు అదే పౌర విమాన‌యాన శాఖ‌ను రామ్మోహ‌న్‌నాయుడికి ప్ర‌ధాని మోడీ కేటాయించారు. అయితే.. ఆయ‌న ఈ ప‌ద‌వి చేప‌ట్టిన వెంట‌నే అనేక స‌మ‌స్య‌లు ఎదురొచ్చాయి. గాలివాన బీభ‌త్సంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు స‌హా.. ప‌లు రాష్ట్రాల్లోనివిమానాశ్ర‌యాల్లో పైక‌ప్పులు కూలిపోయాయి. అదేవిధంగా ఢిల్లీ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల ధ‌ర్నా.. విమానాల ఆల‌స్యం వంటివి అనేకం ఆయ‌న‌కు స‌వాలుగా మారాయి. మొత్తానికి వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా కీల‌క‌మైన గ‌త ప్ర‌శ్నే ఎదురైంది. దేశీయ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ విస్తారా’లో టికెట్‌ ధరలు టికెట్ బుక్ చేసే స‌మ‌యంలో ఒక విధంగా.. ఎమౌంట్ పే చేసే స‌మ‌యంలో రెండు మూడు రెట్లు పెరుగుతున్న‌య‌ని కొంద‌రు ఎంపీలు గురువారం పార్ల‌మెంటులో ప్ర‌శ్నించారు. దీనికి స్పీకర్‌ ఓం బిర్లా కూడా గ‌ళం క‌లిపారు. అనేక మంది ఎంపీల నుంచి కూడా తనకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయ‌న్నారు.

దీనికి పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహ‌న్ స‌మాధానం ఇస్తూ.. అంతర్జాతీయ మార్గాల్లో, హాలిడే సీజన్లలో టికెట్‌ ధరలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. దీనిపైనా విచార‌ణ చేస్తామ‌న్నారు. ``అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం టికెట్‌ ధరలను కేంద్రం నియంత్రించలేదు`` అని చెప్పారు. కాల‌మాన ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసుల‌బాటు సంస్థ‌ల‌కు ఉంద‌న్నారు. కానీ, రెండేళ్ల కింద‌ట ఇదే ప్ర‌శ్న‌పై.. ఆయ‌న అలా ఎందుకు జ‌రుగుతుంద‌న్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అయ్యాక‌.. మోడీ మాటే మాట్లాడారు. దీనికి వివ‌ర‌ణ ఎవ‌రూ అడ‌గ‌లేదు.. ఆయ‌న ఇవ్వ‌లేదు. రాజ‌కీయాల్లో ఇంతే!!