Begin typing your search above and press return to search.

చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి... ఇద్దరూ కలిశారు కాంగ్రెస్ లోకి జంప్ నా ?

చంద్రబాబు కాంగ్రెస్ లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికే అమర్నాధ్ రెడ్డి సీనియర్ నేతగా మంత్రి చేసిన వారు గా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ముఖ్యుడిగా ఉండేవారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 9:53 AM GMT
చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి... ఇద్దరూ కలిశారు కాంగ్రెస్ లోకి జంప్ నా ?
X

ఇద్దరూ ఉమ్మడి ఏపీకి సీఎంలుగా చేసిన వారే. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే. చంద్రబాబు విషయానికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డితో కలసి రాజకీయ ప్రయాణం చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికే అమర్నాధ్ రెడ్డి సీనియర్ నేతగా మంత్రి చేసిన వారు గా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ముఖ్యుడిగా ఉండేవారు.

ఇక నల్లారి చంద్రబాబు కుటుంబాల మధ్య దశాబ్దాల పాటు వైరం సాగుతూ వచ్చింది కానీ జగన్ కారణంగా ఇద్దరూ కలిసారు. ఇపుడు కూటమి పుణ్యమాని మిత్రులుగా కూడా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో నేతగా ఉన్నారు

ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి సడెన్ గా చంద్రబాబు నివాసానికి వెళ్ళి చాలా సేపు రాజకీయ మంతనాలు సాగించడం పట్ల ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కిరణ్ ఎపుడూ చంద్రబాబు ఇంటికి వెళ్ళలేదు. ఇపుడు ఎందుకు వెళ్ళారు అన్న దాని మీద ఆరా తీస్తున్నారు అంతా.

నిజానికి గత పదేళ్ళుగా కిరణ్ కుమార్ రెడ్డి సరైన పొలిటికల్ ప్లాట్ ఫారం మీద అయితే లేరు. ఆయన కాంగ్రెస్ బీజేపీల మధ్య తిరుగుతున్నారు. ఆయన రాజంపేట ఎంపీగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు.

దాంతో ఆయన ఎందుకు బాబుని కలిసారు అన్నది చర్చగా ఉంది. అయితే ఈ ఇద్దరూ కాంగ్రెస్ మాజీలే అన్నది అందరికీ తెలిసిందే. ఇద్దరూ తమ పొలిటికల్ కెరీర్ ని కాంగ్రెస్ నుంచే మొదలెట్టారు. ఇక చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 2918లో తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేశారు

ఈ రోజుకీ కాంగ్రెస్ అగ్ర నేతలతో బాబుకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. ఆయన రాజకీయం ఎన్నో డైమన్షన్స్ తో ఉంటుంది ఏది ఏలా చేసినా కూడా అనుకున్న గమ్యం చేరడమే బాబుకు తెలుసు అని కూడా అంటారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే ఆయన తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు.

ఇపుడు చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్ట బాగా తగ్గిపోతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఎన్నడూ లేని విధంగా బీజేపీ బలహీనంగా ఉందని అంటున్నారు. దాంతో జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయని కూడా అంటున్నారు. దాంతో రాబోయే రోజులలో ఏపీ నుంచి ఏమైనా కీలక పరిణామాలు జరగవచ్చు అన్నది కూడా ఉంది. ఇక ఇండియా కూటమికి ఎన్డీయే కూటమికి మధ్య సీట్ల తేడా చాలా తక్కువగా ఉంది.

పైపెచ్చు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ మద్దతు ఎంతో కీలకంగా ఉంది. దాంతో జాతీయ స్థాయిలో ఏమైనా రాజకీయ పరిణామాలు మారితే కాంగ్రెస్ కి కూడా మద్దతు ఇచ్చే అంశాన్ని టీడీపీ సీరియస్ గానే పరిశీలించవచ్చు అన్న మాట కూడా ఉంది.

ఇక బీజేపీలో ఉన్నా కూడా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ కాంగ్రెస్ అగ్ర నేత్రి సోనియాగాంధీతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలూ కలిసారు అంటే జాతీయ రాజకీయాల మీద కూడా విస్తృతంగా చర్చలు సాగి ఉంటాయని అంటున్నారు.

దేశంలో రాజకీయం మారితే అది ఆంధ్రా నుంచే మొదలవుతుందని కూడా అంటున్నారు. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో పెద్దగా ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన తమ మాతృ సంస్థ

కాంగ్రెస్ లో మళ్లీ చేరినా చేరవచ్చు అని కూడా అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఇద్దరూ కాంగ్రెస్ కి పాత వారే. పాత కాపులే. మరి ఈ ఇద్దరూ కలసి హస్తం వైపుగా చూస్తారా అన్నది ఊహాగానంగా ఉంటుందా లేక ఈ పుకార్లే రేపటి రోజుల ఏమైనా వాస్తవాలుగా మారుతాయా అంటే ప్రస్తుతానికి రాజకీయ పుకార్లుగానే చూడాల్సి ఉంది. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నది మాత్రం ఎవరూ మరవరాదు అంటున్నారు విశ్లేషకులు. సో ఏపీ ఈ రోజుల దేశ రాజకీయాలను మారుస్తుందా అంటే వెయిట్ అండ్ సీ.