Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి లౌక్యం..సీట్లు తగ్గవని చెబుతున్నారు కానీ !

తాజాగా ఒక ప్రముఖ చానల్ ఇంటర్వ్యూకి వచ్చిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అనేక విషయాల మీద మాట్లాడారు.

By:  Tupaki Desk   |   30 March 2025 11:30 AM
కిషన్ రెడ్డి లౌక్యం..సీట్లు తగ్గవని చెబుతున్నారు కానీ !
X

తాజాగా ఒక ప్రముఖ చానల్ ఇంటర్వ్యూకి వచ్చిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అనేక విషయాల మీద మాట్లాడారు. రాజకీయంగా కూడా ఎన్నో పంచుకున్నారు ఇదిలా ఉంటే దక్షిణాది మీద వివక్ష అలాగే డీలిమిటేషన్ వల్ల తగ్గే ఎంపీ సీట్ల గురించి ఆయన మాట్లాడారు.

దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు ఏ మాత్రం తగ్గవని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కానీ అదే టైం లో ఉత్తరాదిన రాష్ట్రాలకు పెరిగే సీట్ల పద్ధతిన దక్షిణాదిన సీట్లు అంతే స్థాయిలో పెరుగుతాయని హామీ ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు.

ప్రధాని మోడీ కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా వంటి వారు ఇప్పటికే ఇదే విషయం స్పష్టం చేశారు అని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. ఒక్క సీటు కూడా తగ్గదని మాట ఇస్తున్నాను అని ఆయన అన్నారు. మరి ఎన్ని సీట్లు ఎక్కువగా పెరుగుతాయన్నది మాత్రం చెప్పలేదని ప్రజాస్వామ్య ప్రియులు మేధావులు అంటున్నారు.

ఉదాహరణకు యూపీలో తీసుకుంటే ప్రస్తుతం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కాస్తా డీలిమిటేషన్ తరువాత ఏకంగా 120 ఎంపీ సీట్లకు పెరుగుతాయని ప్రచారం అంటే అంటే యాభై శాతం పెరుగుదల అన్న మాట. మరి తమిళనాడులో 39 ఉన్నాయి. యాభై శాతం అదే రకమైన పెరుగుదల దామాషా పద్ధతిలో జరగాలి అంటే 60 దాకా ఎంపీ సీట్లు రావాలి. తెలంగాణాకు 27 దాకా రావాలి. ఏపీకి 38 దాకా సీట్లు రావాలి. కర్ణాటక అయితే 42 అవాలి. కేరళకు 30 ఎంపీ సీట్లు పెరగాలి.

కానీ చూడబోతే తమిళనాడుకు 39 కాస్తా ఒకటి రెండు సీట్లు పెరిగి 41కి నంబర్ చేరుకుంటుంది అని అంటున్నారు. అలాగే ఏపీలో మరో రెండో మూడో సీట్లు పెరిగి 28 దాకా అవుతుందని, తెలంగాణా కూడా రెండో మూడో పెరిగి 20 అవుతుందని కేరళకు అయితే ఒకటి రెండు సీట్లు తగ్గి 18 అవుతాయని అంటున్నారు. ఒకవేళ సీట్లు తగ్గవని అనుకుంటే కేరళ 20 కంటే పెరిగే చాన్స్ లేదు.

మరి జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టమే తప్ప లాభం ఎక్కడ ఉందనే అఖిలపక్ష సమావేశంలో సౌత్ స్టేట్స్ లీడర్స్ ప్రశ్నలు సంధించారు కానీ కేంద్ర మంత్రి మాత్రం ఒక్క సీటూ తగ్గదనే అంటున్నారు. తప్ప ఎన్ని సీట్లు పెరుగుతాయన్నది మాత్రం చెప్పలేదని గుర్తు చేస్తున్నారు.

తాము దక్షిణాదికి అన్యాయం చేయమని వివక్ష అన్నదే లేదని కిషన్ రెడ్డి అంటున్నారు. కానీ ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్ స్టేట్స్ లీడర్స్ అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి పన్నుల రూపంలో ఒక రూపాయి దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్తే తిరిగి ఇచ్చేటపుడు మాత్రం యాభై పైసలు కూడా రావడం లేదని కొన్ని చోట్ల అయితే అది నలభై పైసలకు కూడా ఉంటోంది అని అంటున్నారు.

ఈ విషయాల మీద కూడా కిషన్ రెడ్డి సహా కేంద్ర పెద్దలు ఫుల్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అంటే దేవుడికే తెలియాలి అని కిషన్ రెడ్డి ఆసక్తిని పెంచే సమాధానం చెప్పారు. బీజేపీలో ఎవరైనా ప్రెసిడెంట్ కావచ్చు అని ఆయన దానికి కొనసాగింపుగా మరో మాట చెప్పారు.

బీజేపీలో ప్రజాస్వామ్యం ఉందని ప్రాంతీయ పార్టీలలో వారసత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయం సాగుతోందని అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయని ఆయన విమర్శించారు. మొత్తానికి చూస్తే కిషన్ రెడ్డి తమ పార్టీ పదేళ్ల పాలనలో దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయని ప్రపంచ దేశాలలో భారత్ తలెత్తుకుని తిరిగేలా చేసింది నరేంద్ర మోడీ అని అంటున్నారు.