పరామర్శకు వెళ్లి పాట్లు.. అడ్డంగా బుక్కయిన కిషన్ రెడ్డి!
అయినా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో మున్నేరుకు భారీగా వరద చేరుకుం టోంది.
By: Tupaki Desk | 8 Sep 2024 3:25 PM GMTవరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులకు, నాయకులకు బాధిత ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గత వారం నుంచి కంటిపై కునుకు లేకుండా మున్నేరు కారణంగా ఖమ్మం నీట మునిగిం ది. అయితే.. గత రెండురోజులుగా కొంత తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఇంతలోనే శనివారం మరోసారి కుండపోత వర్షం కురవడంతో ఖమ్మం మరోసారి జలమయమైంది. దీంతో సర్కారు సహాయక చర్యలు చేపట్టింది. అయినా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో మున్నేరుకు భారీగా వరద చేరుకుం టోంది.
దీంతో బాధితులకు సహాయం అందించడం కూడా కష్టంగా మారుతోంది. ఇదిలావుంటే.. బాధితులను ప రామర్శించేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఖమ్మంలోని దంసలా పురం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆయన పరామర్శించారు. అయితే.. ఈసంద ర్భంగా బాధిత మహిళలు పెద్ద పెట్టున తమ గోడు వినిపించడంతోపాటు.. మంత్రిపై రుసరుసలాడారు. తమకు ఎలాంటి సాయం అందడం లేదని.. చచ్చామో.. బతికామో చూసేందుకు వచ్చారా? అని ప్రశ్నించారు.
అయితే.. వారి ఆగ్రహం తగ్గిన తర్వాత కేంద్ర మంత్రి అనునయించే ప్రయత్నం చేశారు. అన్ని సహాయక చర్యలు చేపడతామని.. బాధితులను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తక్షణ సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. దీంతో బాధితులు శాంతించారు. ఈ పర్యటనలో సీనియర్ నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలావుంటే.. ఖమ్మానికి వరద పోటు తప్పడం లేదు. మధిర మండలం చిలుకూరు వద్ద వైరా నది పొంగి పొర్లుతోంది. దీంతో రోడ్డుపైకి వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు.
డేంజర్‌గా మున్నేరు..
మున్నేరు ప్రవాహం జోరుగా సాగుతోంది. దీంతో ఇక్కడ డేంజర్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ప్రవా హం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇదిలావుంటే.. మున్నేటి వరద ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలపైనా పడింది. దీంతో ఇక్కడి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.