కిషన్ రెడ్డి జగన్ని పొగిడారా...లేక ...?
కిషన్ రెడ్డి మాత్రం ఏపీ పాలన బాగుందని మెచ్చుకోవడం ఒక విధంగా ఏపీ బీజేపీ నేతలకే షాకింగ్ పరిణామం అని అంటున్నారు.
By: Tupaki Desk | 22 July 2023 2:42 PM GMTతెలంగాణా బీజేపీకి కొత్త సారధిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన అట్టహాసంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలి స్పీచ్ నే కేసీయార్ మీద సింహ గర్జన చేసే స్థాయిలో అదరగొట్టారు. కేసీయార్ ది కుటుంబ పాలన అన్నారు. నిజాంలతో పోల్చారు.
మేము మీకు బానిసలమా అని బిగ్ సౌండ్ చేశారు. ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ కేసీయార్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని కూడా నిందిస్తూ సుదీర్ఘమైన స్పీచ్ నే కిషన్ రెడ్డి ఇచ్చారు. అయితే కేసేయార్ ఒక విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ తెలంగాణా ప్రభుత్వంతో పోలిక తెస్తూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
తొమ్మిదేళ్ళుగా తెలంగాణాలో అధికారంలో ఉన్నారు. పేదలకు ఒక్క ఇల్లు అయినా నిర్మించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అదే ఏపీలో అయితే ఇరవై లక్షల ఇళ్ళు కడితే కేసీయార్ ప్రభుత్వం ఏమి చేస్తోందని నిలదీశారు.
తెలంగాణాలో కేసీయార్ మాత్రం కేవలం నాలుగు నెలల వ్యవహ్దిలో పది ఎకరాలలో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి నిజాం భవనం కట్టుకున్నారని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొతానికి చూస్తే కేసీయార్ ని విమర్శిస్తూ ఏపీ ప్రభుత్వం పనితీరు బాగుందని బీజేపీ ప్రెసిడెంట్ చెప్పారని అంటున్నారు.
ఏపీలో అభివృద్ధి లేదు, అవినీతి తప్ప అంటూ సాక్ష్తాతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే కామెంట్స్ చేశారు. అలాగే బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఏపీలో నాలుగేళ్ళ పాలన అంతా దారుణం ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.
ఇక బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అయితే ఏపీకి వైసీపీ అత్యంత ప్రమాదకరమని ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఉండనీయకుండా చేయాలని నినదిస్తున్నారు. ఏపీలో వైసీపీ పాలనకు బై బై చెప్పాలని ఆయన అంటున్నారు. అదే విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలు సైతం నాలుగేళ్ల పాలన నరకం అంటున్నారు.
ఇలా ఏపీలో అన్ని పార్టీలు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు తారస్థాయిలో చేస్తూంటే కిషన్ రెడ్డి మాత్రం ఏపీ పాలన బాగుందని మెచ్చుకోవడం ఒక విధంగా ఏపీ బీజేపీ నేతలకే షాకింగ్ పరిణామం అని అంటున్నారు. ఏపీలో ఒక్క ఇల్లు అయినా నిర్మించారా అని చంద్రబాబు లోకేష్ ఒక వైపు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
అయితే ఇరవై లక్షల ఇళ్ళను వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కిషన్ రెడ్డి లెక్క చూసి మరీ చెప్పడం అధికార పార్టీకి జగన్ కి ఎంతో మేలు చేస్తూండగా విపక్షం మాత్రం ఇరుకున పడెలాగానే ఉంది అంటున్నారు. మరి కేసీయార్ ని విమర్శించే ఫ్లోలో ఏపీ సర్కార్ ని పోలిక తెచ్చాలా లేక నిజంగానే ఏపీ ప్రభుత్వం పనితీరు బాగుందని కిషన్ రెడ్డి అన్నారా అన్నదే చర్చకు వస్తున్న విషయం.