ఎన్నికల నిబంధనలు పాటించని కిషన్ రెడ్డి?
కాంగ్రెస్ అభ్యంతరాల నేపథ్యంలో కిషన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనలు పాటించలేదని కేసు పెట్టారు.
By: Tupaki Desk | 13 May 2024 8:40 AM GMTసికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణ మీద ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు పెట్టారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు గురించి మాట్లాడటంలో తప్పు లేదు.
మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేపోతున్నారు. పార్టీ, వ్యక్తుల పేర్లు ఎన్నికల సందర్భంగా ప్రస్తావించకూడదు. కానీ కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ పేరు వాడటంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఉద్దేశంతో కిషన్ రెడ్డిపై కేసు పెట్టారు. మోదీ పేరు ప్రస్తావించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంపై కాంగ్రెస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కొత్తేమీ కాదు. కానీ కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం గమనార్హం.
ఎన్నికల సంఘం నిబంధనలు ఎవరు పట్టించుకోకపోయినా శిక్షార్హులే. కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో చాలా మంది జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అభ్యంతరాల నేపథ్యంలో కిషన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనలు పాటించలేదని కేసు పెట్టారు. ఎన్నికల సమయంలో ప్రధాని పేరు ప్రస్తావించడం సబబుకాదనే విషయం ఆయనకు తెలియదా అంటున్నారు.
ఎన్నికల సమయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదనే నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతోనే ఆయనపై కేసు పెట్టారు. ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆచితూచి మాట్లాడాలని చెబుతున్నారు.