Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి.. ‘మిషన్ కశ్మీర్’.. గట్టెక్కించే బాధ్యత ఆయనదే

రెండు భాగాలుగా చేశారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 12:30 AM GMT
కిషన్ రెడ్డి.. ‘మిషన్ కశ్మీర్’.. గట్టెక్కించే బాధ్యత ఆయనదే
X

అనేక విషయాల్లో సున్నితమైన రాష్ట్రం జమ్మూ కశ్మీర్. సరిగ్గా ఐదేళ్ల కిందట ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 రద్దు పెద్ద సంచలనం. ఆ చర్యతో మోదీ ప్రభుత్వ కీర్తి మిగతా భారతదేశంలో ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదే సమయంలో కశ్మీర్ ను

రెండు భాగాలుగా చేశారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయి. అప్పటినుంచి ఇదే తీరున ఉన్న ఆ ప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఎంతవరకు సాధిస్తారో..?

కశ్మీర్ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ హైకమాండ్. మొన్నటికి మొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కేబినెట్ హోదా ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు కశ్మీర్ బాధ్యతలూ కేటాయించడం గమనార్హం.

జమ్మూకశ్మీర్‌ లో ఈ సెప్టెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలనేది సుప్రీం కోర్టు ఆదేశం. దీంతోపాటే మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లు గెలిపించిన గుర్తింపును కిషన్ రెడ్డి పొందారు.

జమ్మూ కశ్మీర్ ను జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్ వ్యవస్థీకరించారు. దీని తర్వాత కశ్మీర్ శాసనసభ లోని మొత్తం స్థానాలు 114కు పెరిగాయి. అయితే, ఇందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధి లోకి వచ్చేవి ఉండడం గమనార్హం. ఇతర 90 సీట్లలో 43 జమ్మూలో, 47 కశ్మీర్ లో ఉన్నాయి.

బీజేపీ సర్కారు వస్తుందా?

ఎన్నడూలేని విధంగా 2014 తర్వాత కశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వంలో చేరింది. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పొందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇంతలోనే పునర్ వ్యవస్థీకరణ జరిగింది. మరిప్పుడు మళ్లీ కశ్మీర్ లో బీజేపీకి అధికారం అందించాల్సిన బాధ్యత తెలుగువాడైన కిషన్ రెడ్డి భుజాలపై ఉంచారు. ఏం జరుగుతుందో చూద్దాం..